iDreamPost
android-app
ios-app

అల్లు అర్జున్‌ సాయం.. లేడీ అభిమాని దశ తిరిగింది!

అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఎలక్షన్‌ నేపథ్యంలో గురువారం షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చారు. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఎలక్షన్‌ నేపథ్యంలో గురువారం షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చారు. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అల్లు అర్జున్‌ సాయం.. లేడీ అభిమాని దశ తిరిగింది!

ప్యాన్‌ ఇండియా స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు. చిత్ర షూటింగ్‌ క్లైమాక్స్‌ దశకు చేరుకుంది. పుష్ప ది రైజ్‌ దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా హిందీలో ఈ మూవీకి సూపర్‌ క్రేజ్‌ లభించింది. నార్త్‌ ఫ్యాన్స్‌ ఓ తెలుగు సినిమాను ఇంతలా ఓన్‌ చేసుకోవటం ఇదే మొదటి సారి. ముఖ్యంగా పుష్ప చిత్రంలోని పాటలు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ తెచ్చుకున్నాయి. పేదల దగ్గరినుంచి కోటీశ్వరుల పెళ్లిళ్లలో కూడా పుష్ప పాటలు హల్‌చల్‌ చేశాయి.

సినిమాలో అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగులు సైతం బాగా ఫేమస్‌ అయ్యాయి. ఇలా అన్ని రకాలుగా పుష్ప ప్రేక్షకులకు ఎక్కేసింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ పుష్ప :ది రూల్‌’ ఇంతకు మించి ఉండాలని దర్శకుడు సుకుమార్‌ భావిస్తున్నారు. అందుకే ప్రతీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. క్యాస్టింగ్‌, పాటలు, డైలాగులు, ఫైట్స్‌ ఇలా అన్ని విషయాలు మొదటి భాగానికి మించి ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అల్లు అర్జున్‌ కూడా ఎక్కడా రాజీ పడకుండా తన పాత్రకు న్యాయం చేస్తున్నారు.

ఇక, ‘ పుష్ప: ది రూల్‌’ షూటింగ్‌తో బిజీగా ఉన్న అల్లు అర్జున్‌ ఎలక్షన్‌ రోజు సెలవు పెట్టేశారు. గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓటు హక్కు వినియోగించుకుని బయటకు వచ్చిన అల్లు అర్జున్‌ను ఓ లేడీ అభిమాని కలిశారు. ఆ లేడీ అభిమాని పేరు అశ్విని. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నిర్వహిస్తోంది. వీడియోలు సైతం చేసి పెడుతుంది. తన గురించి పరిచయం చేసుకుంది.

దీంతో అల్లు అర్జున్‌ ఆ లేడీ ఫ్యాన్‌ కోసం స్వయంగా తనే వీడియో తీశారు. ‘‘ సరే.. నీకు బాగా ఫాలోవర్స్‌ రావాలని మంచి వీడియో తీస్తున్నాను. ఎంత మంది ఫాలోవర్స్‌ కావాలి. ఇప్పుడు ఎంత మంది ఉన్నారు’’ అని అడిగారు. అందుకు ఆమె ‘‘ 13కే ’’ అని చెప్పింది. అప్పుడు అల్లు అర్జున్‌ ‘‘ మినిమమ్‌ ఎంత టచ్‌ అవ్వాలి’’ అని అడిగారు. అశ్విని ‘‘ 20 – 30 కే’’ అని అంది. ‘‘ 30కే.. ఈ వీడియోతో వస్తారా?’’ అని అల్లు అర్జున్‌ ప్రశ్నించారు. అందుకు అశ్విని ‘‘ వస్తారు అండి ’’ అంది.

‍ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో అశ్విని ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్స్‌ అనుకోని విధంగా పెరుగుతున్నారు. ఇప్పటి వరకు ఏకంగా 6 వేల మంది ఫాలోవర్స్‌ వచ్చారు. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరి, అల్లు అర్జున్‌ చిరు సాయం కారణంగా అశ్విని దశ తిరగటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by _its_me_ashwini_❤️‍🩹 (@_its_me_ashwini_23)

Jojobet GirişmeritbetmeritbetholiganbetPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler