iDreamPost
android-app
ios-app

‘హాయ్‌ నాన్న’ సినిమాపై అల్లు అర్జున్‌ ఎమోషనల్‌ పోస్టు!

  • Published Dec 11, 2023 | 1:01 PM Updated Updated Dec 11, 2023 | 3:26 PM

నాని హీరోగా.. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘హాయ్‌ నాన్న’ సినిమా డిసెంబర్‌ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రానికి అన్ని వర్గాలనుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది...

నాని హీరోగా.. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘హాయ్‌ నాన్న’ సినిమా డిసెంబర్‌ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రానికి అన్ని వర్గాలనుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది...

  • Published Dec 11, 2023 | 1:01 PMUpdated Dec 11, 2023 | 3:26 PM
‘హాయ్‌ నాన్న’ సినిమాపై అల్లు అర్జున్‌ ఎమోషనల్‌ పోస్టు!

న్యాచురల్‌ స్టార్‌ నాని తాజా సెన్సేషన్‌ ‘హాయ్‌ నాన్న’ సాధారణ జనం నుంచి సెలెబ్రిటీల వరకు అందరి మనసుల్ని కదిలిస్తోంది. ఫాదర్‌ సెంటిమెంట్‌ బాగా వర్కవుట్‌ అయింది. కేవలం కూతుర్లు ఉన్న తండ్రులే కాదు.. అందరూ బాగా కనెక్ట్‌ అవుతున్నారు. డిసెంబర్‌ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా కూడా సూపర్‌ అనిపించుకుంటోంది. విడుదలైన అన్ని భాషల్లో మంచి వసూళ్లను సాధిస్తోంది. ఇక, హాయ్‌ నాన్న సినిమాపై తాజాగా హీరో అల్లు అర్జున్‌ స్పందించారు.

ఈ మేరకు సోమవారం ఓ ఎమోషనల్‌ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ హాయ్‌ నాన్న టీమ్‌ సభ్యులందరికీ శుభాకాంక్షలు. ఎంతో చక్కటి సినిమా. నిజంగా మనసును తాకింది. నాని ఎంతో అద్భుతంగా నటించారు. నాని ఇలాంటి మంచి కథకు పచ్చజెండా ఊపి.. వెలుగులోకి తీసుకొచ్చారు. మృణాల్‌ నీ నటన చాలా బాగుంది. నీ అంత అందంగా తెరపై కనిపించింది. బేబీ కియారా డార్లింగ్‌ నీ క్యూట్‌నెస్‌తో మనసుల్ని కరిగించావు. ఇక, స్కూలుకు వెళ్లు.. చిత్రానికి పని చేసి ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కు నా శుభాకాంక్షలు.

Allu Arjun's emotional post on the movie 'Hi Nanna'

కెమెరామ్యాన్‌ పనితనం బాగుంది. ఇతర టెక్నీషియన్లు కూడా బాగా పని చేశారు. హేషమ్‌ సంగీతం.. శౌర్యవ్‌ దర్శకత్వం బాగున్నాయి. శౌర్యవ్‌ తొలి సినిమాతోనే అందరినీ ఇంప్రెస్‌ చేశారు. మనసును తాకే.. కంటతడి పెట్టించే సీన్లను ఎన్నో క్రియేట్‌ చేశారు. అద్భుతమైన ప్రజెంటేషన్‌. నిర్మాతలకు కూడా శుభాకాంక్షలు. హాయ్‌ నాన్న కేవలం తండ్రులనే కాదు.. కుటుంబంలోని అందరి గుండెల్ని తాకుతుంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, హాయ్‌ నాన్నలో నానికి జంటగా ‘మృణాల్‌ ఠాకూర్‌’ నటించారు.  కియారా ఖన్నా, శృతి హాసన్‌, జయరామ్‌, అంగద్‌ బేడీ, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఇక, ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ప్రస్తుతం మంచి కలెక్షన్లతో థియేటర్లలో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో జనం హాయ్‌ నాన్నకు బ్రహ్మరథం పడుతున్నారు. యానిమల్‌ సినిమాతో పోటీగా హాయ్‌ నాన్న ఆడుతోంది. మొదటి రోజు ఓవర్‌సీస్‌లో దాదాపు 3 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.

అల్లు అర్జున్‌ చెప్పినట్లుగానే నూతన దర్శకుడు ‘శౌర్యవ్‌’ కథను అద్భుతంగా తెరకెక్కించారు. స్క్రీన్‌ ప్లే విషయంలో శభాష్‌ అనిపించుకున్నారు. కథను చాలా డిఫరెంట్‌గా తీశారు. మరి, అల్లు అర్జున్‌ .. హాయ్‌ నాన్న సినిమాపై ఎమోషనల్‌ పోస్టు పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio