iDreamPost
android-app
ios-app

Allu Arjun: పుష్ప 3పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్‌.. పక్కా అన్నమాట

  • Published Feb 17, 2024 | 8:33 AM Updated Updated Feb 17, 2024 | 8:33 AM

కొన్ని రోజులుగా పుష్ప పార్ట్‌ 3 ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా బన్నీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ వివరాలు..

కొన్ని రోజులుగా పుష్ప పార్ట్‌ 3 ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా బన్నీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ వివరాలు..

  • Published Feb 17, 2024 | 8:33 AMUpdated Feb 17, 2024 | 8:33 AM
Allu Arjun: పుష్ప 3పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్‌.. పక్కా అన్నమాట

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్‌ని పాన్‌ ఇండియా స్టార్‌గా, డైరెక్టర్‌గా నిలిపిన సినిమా పుష్ప. సౌత్‌లోనే కాక ఉత్తరాదిలో కూడా భారీ విజయం సాధించి.. సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేసింది పుష్ప చిత్రం. ఈ మూవీలోని పాటలు అప్పట్లో దేశాన్ని ఓ ఊపు ఊపాయి. పుష్ప 1 భారీ విజయం నేపథ్యంలో.. పార్ట్‌ 2 పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్ట్‌ 15న పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా పుష్ప పార్ట్‌ 3 కూడా ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ వివరాలు..

తాజాగా అల్లు అర్జున్‌.. జర్మనీలో జరుగుతోన్న ప్రతిష్టాత్మక 74వ బెర్లిన్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నాడు. అనంతరం ఓ ఇంటర్నేషనల్ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ పుష్ప 2 సినిమా గురించి క్రేజీ కామెంట్స్ చేశాడు. ఈ సందర్భంగానే పుష్ప పార్ట్‌ 3పై స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశాడు బన్నీ. కచ్చితంగా పుష్ప 3ని ఆశించొచ్చు అన్నాడు. దాంతో పార్ట్‌ 3 కచ్చితంగా ఉంటుందనే క్లారిటీ వచ్చేసినట్లు అయింది.

ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ.. ‘‘మీరు ఖచ్చితంగా పుష్ప పార్ట్‌ 3ని ఆశించొచ్చు. మేం దీన్ని ఒక ఫ్రాంచైజీగా మార్చాలనుకుంటున్నాం. దీని లైనప్ కోసం మాకు అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి. ఇక పుష్ప 2 విషయానికొస్తే.. పార్ట్‌ 1లో చూసిన దానికంటే మరింత పవర్‌ఫుల్‌గా ఉండనుంది. క్యారెక్టరైజేషన్ పరంగా పుష్ప 1లో చూసింది చాలా తక్కువ. కానీ పార్ట్‌ 2లో పుష్పరాజ్‌ అసలు క్యారెక్టర్ చూస్తారు. అన్ని విధాలుగా పుష్ప 2.. ఫస్ట్ పార్ట్ కంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటివరకు కేవలం ఆ ప్రాంతానికే పరిమితమైన పుష్ప పేరు.. పార్ట్ 2లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వినబడుతుంది’’అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో పుష్ప 3 పక్కా అని హ్యాపీగా ఫీలవుతున్నారు అభిమానులు.

పుష్ప సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా ప్రారంభించినప్పుడు.. దీన్ని ఒక్క పార్ట్‌లోనే కంప్లీట్‌ చేయాలని దర్శకుడు సుకుమార్‌ ప్లాన్‌ చేసుకున్నాడు. కానీ షూటింగ్‌ ప్రారంభం అయిన తర్వాత.. రెండు పార్ట్‌లుగా తెరకెక్కిస్తే బాగుంటుందని భావించాడు. అందుకు బన్నీ కూడా అంగీకారం తెలపడంతో.. పుష్ప 2 సీక్వెల్ సిద్ధమైంది. అయితే పుష్ప దెబ్బకి బన్నీ మూవీ ప్లానింగ్ మొత్తం మారిపోయింది. ఎందుకంటే పుష్ప ముగిసిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తానని ప్రటించాడు అల్లు అర్జున్.

కానీ పుష్ప 2 సడెన్‌గా రావడంతో త్రివిక్రమ్ సినిమా పక్కకి వెళ్లిపోయింది. అంతేకాక పుష్ప 2 తర్వాత కూడా అల్లు అర్జున్.. త్రివిక్రమ్‌తో కాకుండా డైరెక్టర్ అట్లీతో సినిమా చేయాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. ఎందుకంటే జవాన్ సినిమాతో అట్లీ భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. పుష్ప 2 రిలీజ్‌ తర్వాత.. అట్లీతో ప్రాజెక్ట్ చేస్తే పాన్ ఇండియా లెవల్లో తన క్రేజ్‌ మరింత పెరుగుతుందని భావిస్తున్నాడట బన్నీ. మొత్తానికి పుష్ప 3 పార్ట్‌ ఉంటుందని క్లారిటీ వచ్చేసింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş