iDreamPost
android-app
ios-app

అల్లు అర్హ ఫస్ట్ డే స్కూల్‌ కు వెళ్లింది చూశారా? క్యూట్‌ ఫోటోస్‌ వైరల్!

  • Author ajaykrishna Published - 09:37 AM, Thu - 10 August 23
  • Author ajaykrishna Published - 09:37 AM, Thu - 10 August 23
అల్లు అర్హ ఫస్ట్ డే స్కూల్‌ కు వెళ్లింది చూశారా? క్యూట్‌ ఫోటోస్‌ వైరల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య స్నేహారెడ్డి.. కూతురు అర్హలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అల్లు అర్హకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అల్లు అర్జున్ కూతురుగా అందరికీ తెలిసినప్పటికి.. రీసెంట్ గా శాకుంతలం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సిల్వర్ స్క్రీన్ పై డెబ్యూ చేసింది అర్హ. మొదటి సినిమాలోనే క్యూట్ గా డైలాగ్స్ చెబుతూ.. అందరిని ఆకట్టుకుంది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. అర్హకి మాత్రం మంచి పేరొచ్చింది. ఇక తన పేరెంట్స్ తో కలిసి ఎప్పటికప్పుడు ఫ్యామిలీ వీడియోలు, ఫోటోలలో సందడి చేసే అర్హ.. మొత్తానికి ఇల్లు విడిచి.. స్కూల్ కి వెళ్లే టైమ్ వచ్చేసిందట.

ఇన్ని రోజులు ఇంటి పట్టునే ఉంటూ ఆటలు, పాటలతో ఎంజాయ్ చేసిన అర్హ.. స్కూలింగ్ లైఫ్ మొదలు పెట్టేసింది. ఆగష్టు 9 నుండి అర్హ స్కూల్ కి వెళ్లడం మొదలైంది. ఈ విషయాన్నీ స్వయంగా అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం జరిగింది. అర్హ తన అన్న అయాన్ చేయి పట్టుకొని.. ఫస్ట్ డే స్కూల్ కి వెళ్ళింది అంటూ.. స్నేహరెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోకి ‘ఫస్ట్‌ డే ఆఫ్‌ స్కూల్‌’ అని క్యాప్షన్‌ జోడించింది. ఆ ఫోటోలో అయాన్, అర్హ ఇద్దరు బ్యాగులు వేసుకొని వెళ్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. వారి బ్యాగులపై అయాన్, అర్హ అని పేర్లు కూడా ఉండటం. ఈ లెక్కన వీరిద్దరికి బ్యాగ్స్ పై పేర్లు వచ్చేలా స్పెషల్ గా డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అల్లు అర్హ ఫస్ట్‌ డే స్కూల్‌ కి వెళ్తున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అల్లు వారి అన్నాచెల్లెళ్లు ఎంత బుద్దిగా స్కూల్ కి వెళ్తున్నారో అని ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అల్లు అర్హ స్కూల్ కి వెళ్తున్నప్పటికి.. సినిమాలు కూడా కంటిన్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ దేవరలో అర్హ క్యారెక్టర్ చేస్తుందట. ఇందులో జాన్వీ కపూర్ కి సంబంధించి చిన్ననాటి పాత్రలో అర్హ కనిపించనుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక బన్నీ హీరోగా ప్రస్తుతం పుష్ప 2 చేస్తున్నాడు. మరి అల్లు అర్హ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş