iDreamPost
android-app
ios-app

మహేశ్ విషయంలో అల్లు అరవింద్ కోరిక తీరలేదు! అసలేం జరిగిందంటే?

  • Published Aug 04, 2024 | 12:30 AM Updated Updated Aug 04, 2024 | 12:30 AM

Allu Aravind- Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ సినిమా చేయాలన్నది అరవింద్ కోరిక. కానీ ఈ మూవీ విషయంలో అల్లు అరవింద్ లెక్కలు తప్పాయి. అసలు ఏం జరిగింది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Allu Aravind- Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ సినిమా చేయాలన్నది అరవింద్ కోరిక. కానీ ఈ మూవీ విషయంలో అల్లు అరవింద్ లెక్కలు తప్పాయి. అసలు ఏం జరిగింది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Aug 04, 2024 | 12:30 AMUpdated Aug 04, 2024 | 12:30 AM
మహేశ్ విషయంలో అల్లు అరవింద్ కోరిక తీరలేదు! అసలేం జరిగిందంటే?

అల్లు అరవింద్.. టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు. ఏ సినిమాను ఎంత బడ్జెట్ లో నిర్మించాలి, ఎలాంటి కథలను సెలక్ట్ చేసుకోవాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు అంటారు ఇండస్ట్రీలో ఉన్న కొందరు ప్రముఖులు. తన కెరీర్ లో ఎంతో మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసిన అరవింద్ కు ఓ కోరిక మిగిలిపోయింది. దాన్ని తీర్చుకునేందుకు పక్కాగా ప్రణాళికలు రచించారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ సినిమా చేయాలన్నది అరవింద్ కోరిక. కానీ ఈ మూవీ విషయంలో అల్లు అరవింద్ లెక్కలు తప్పాయి. అసలు ఏం జరిగింది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ సినిమా చేయాలన్నది కల. ఇక ఇందుకోసం ఓ బాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకొన్నాడు. తెలుగు వెర్షన్ వరకు తానే చూసుకునే విధంగా అంగీకారం కూడా జరిగింది. సబ్జెక్ట్ కూడా ఓకే అయిపోయింది. కానీ ఏమైందో తెలీదు.. కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే ఇప్పుడు అక్కడ మహేశ్ తో అనుకున్న కథతో మూవీ ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. బాలీవుడ్ మేకర్స్ తో కలిసి రామాయణం గాథను సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు అరవింద్ గతంలో ఓసారి చెప్పారు. ఆ మూవీలో హీరో ఎవరు అన్న సంగతి బయటకిరాలేదు. ఈ విషయాలన్నీ నిర్మాత బన్నీ వాసు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

అసలు విషయం ఏంటంటే? బన్నీ వాసు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే.. రామాయణాన్ని మహేశ్ బాబుతోనే తెరకెక్కించాలని చూసినట్లు తెలుస్తోంది. కానీ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది. సాయిపల్లవి సీతగా, రణ్ బీర్ కపూర్ రాముడిగా రామాయణం రూపొందుతున్న విషయం తెలిసిందే. దాంతో మహేశ్ తో తీద్దామనుకున్న ప్రాజెక్ట్ కాస్త.. రణ్ బీర్ చేస్తున్నాడా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సూపర్ స్టార్ తో సినిమా తీయాలనుకున్న అల్లు అరవింద్ కోరిక అలాగే మిగిలిపోయింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetbaba girişgrandpashabet