iDreamPost
android-app
ios-app

Sudigadu 2: త్వరలోనే ‘సుడిగాడు 2’.. కథ నేనే రాస్తున్నా: అల్లరి నరేష్

  • Published Apr 23, 2024 | 12:11 PM Updated Updated Apr 23, 2024 | 12:11 PM

సుడిగాడు సీక్వెల్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు అల్లరి నరేష్. త్వరలోనే సుడిగాడు 2 రాబోతుందని, దానికి కథ నేను రాస్తున్ననని చెప్పాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

సుడిగాడు సీక్వెల్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు అల్లరి నరేష్. త్వరలోనే సుడిగాడు 2 రాబోతుందని, దానికి కథ నేను రాస్తున్ననని చెప్పాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Apr 23, 2024 | 12:11 PMUpdated Apr 23, 2024 | 12:11 PM
Sudigadu 2: త్వరలోనే ‘సుడిగాడు 2’.. కథ నేనే రాస్తున్నా: అల్లరి నరేష్

‘సుడిగాడు’.. అల్లరి నరేష్, డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావు కాంబినేషన్ లో వచ్చిన స్ఫూఫ్, కామెడీ చిత్రం. 2012లో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటుగా కాసుల వర్షం కురిపించింది. అప్పట్లో రూ. 7 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 32 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఈ ఫుల్ లెంత్ కామెడీ మూవీకి సీక్వెల్ వస్తుందని ప్రేక్షకులు భావించారు. కానీ అప్పట్లో మేకర్స్ ఏమీ ప్రకటించలేదు. తాజాగా సుడిగాడు సీక్వెల్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు అల్లరోడు. త్వరలోనే సుడిగాడు 2 రాబోతుందని, దానికి కథ నేను రాస్తున్ననని చెప్పాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

అల్లరి నరేష్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ ‘ఆ ఒక్కటీ అడక్కు’ కొత్త దర్శకుడు మల్లి అంకం ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నాడు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. సుడిగాడు పార్ట్ 2 గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. “నా కెరీర్ లో కితకితలు మూవీతో పాటుగా సుడిగాడు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సుడిగాడు మూవీకి సీక్వెల్ తీసుకొస్తాం. ఇక ఈ మూవీ కథ నేనే రాస్తున్నాను. స్క్రీప్ట్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ మూవీ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేస్తాం” అని అల్లరి నరేష్ తెలిపాడు.

దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. గత కొంతకాలంగ అల్లరి నరేష్ నుంచి ఔట్ అండ్ ఔట్ కామెడీ రాలేదు. నాంది నుంచి నా సామిరంగ వరకు విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకుసాగుతున్నాడు. ఇక ఇప్పుడు సుడిగాడు 2 రాబోతుందని చెప్పడంతో.. ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఆ ఒక్కటి అడక్కు మూవీ వేసవి కానుకగా మే 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పెళ్లి కాన్సెప్ట్ పై వస్తున్న పూర్తి కామెడీ చిత్రంగా తెరకెక్కింది ఈ మూవీ.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss