iDreamPost
android-app
ios-app

ఆ ఒక్కటీ అడక్కు టీజర్ రిలీజ్.. కమ్మ, కాపు అంటూ ఫుల్ ఫన్!

  • Published Mar 12, 2024 | 5:43 PM Updated Updated Mar 12, 2024 | 5:43 PM

Aa Okkati Adakku Teaser: అల్లరి నరేశ్ తిరిగి తనకు బాగా కలిసొచ్చిన జానర్ కి తిరిగి వచ్చేశాడు. ఆ ఒక్కటీ అడక్కు అంటూ అల్లరి చేస్తున్నాడు. ఆ మూవీ టీజర్ కూడా రిలీజ్ అయ్యింది.

Aa Okkati Adakku Teaser: అల్లరి నరేశ్ తిరిగి తనకు బాగా కలిసొచ్చిన జానర్ కి తిరిగి వచ్చేశాడు. ఆ ఒక్కటీ అడక్కు అంటూ అల్లరి చేస్తున్నాడు. ఆ మూవీ టీజర్ కూడా రిలీజ్ అయ్యింది.

  • Published Mar 12, 2024 | 5:43 PMUpdated Mar 12, 2024 | 5:43 PM
ఆ ఒక్కటీ అడక్కు టీజర్ రిలీజ్.. కమ్మ, కాపు అంటూ ఫుల్ ఫన్!

అల్లరి నరేశ్ కు టాలీవుడ్ ఆడియన్స్ లో స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. నరేశ్ చేసే సినిమాలు, వేసే పంచులు అంటే అందరికీ విపరీతమైన ఇష్టం ఉంటుంది. టాలీవుడ్ లో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత హీరోగా మళ్లీ అన్ని సినిమాలు చేయడం కేవలం అల్లరి నరేశ్ కు మాత్రమే సాధ్యం అంటూ అనుకుంటున్న సమయంలో నరేశ్ కెరీర్ స్లో అయిపోయింది. ఆ తర్వాత నరేశ్ జానర్ కూడా మార్చేశాడు. కేవలం ఫన్ మాత్రమే కాకుండా.. తనలో మంచి నటుడు కూడా ఉన్నాడని ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ తనకు బాగా తెలిసిన, ఆడియన్స్ కి నచ్చిన జానర్ లోకి వచ్చేశాడు. ఆ ఒక్కటీ అడక్కు అంటూ ఆడియన్స్ కి కితకితలు పెట్టబోతున్నాడు.

అల్లరి నరేశ్ అంటేనే కామెడీ పంచులు, టైమింగ్ తో పేలే డైలాగులు. అలాంటి నరేశ్ కొన్నాళ్లు కామెడీ జానర్ కు దూరంగా ఉన్నాడు. ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం, ఉగ్రం వంటి సినిమాలతో సీరియస్ యాక్టర్ గా చేశాడు. అయితే అల్లరి నరేశ్ నుంచి కామెడీ చిత్రాలు ఎప్పుడొస్తాయి అంటూ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. ఇప్పుడు ఆ నిరీక్షణకు తెర పడినట్లు అయ్యింది. ఆ ఒక్కటీ అడక్కు అంటూ కామెడీ ఫిల్మ్ తో అల్లరి నరేశ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని సమ్మర్ కు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఒక్కటీ అడక్కు చిత్రం నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు. టీజర్ చూస్తున్నంత సేపు అల్లరి నరేశ్ ఈజ్ బ్యాక్ అనే భావన కలుగుతుంది.

ఈ మూవీలో నరేశ్ సరసన ఫరియా అబ్దుల్లా నటిస్తోంది. టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ డైలాగులు, పంచులతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అల్లరి నరేశ్ కు సపోర్ట్ గా వెన్నెల కిశోర్ పాత్రను ప్లాన్ చేశారు. ఒక్కో పంచు కడుపుబ్బా నవ్వుకునేలా ఉంది. వింటేజ్ అల్లరి నరేశ్ ను గుర్తు చేస్తారు. ఈ టైటిల్ తో గతంలో రాజేంద్ర ప్రసాద్- రావు గోపాలరావు కాంబోలో చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. అలాంటి ఒక టైటిల్ ని మళ్లీ రిపీట్ చేస్తున్నారు అంటే స్టోరీలో ఆ సినిమాకి తగ్గట్లుగానే ఉండాలి. అంత ధైర్యం చేసి టైటిల్ ని తీసుకున్నారు అంటేనే అర్థం చేసుకోవాలి సినిమాలో ఎంత విషయం ఉందో. ఆ సంగతి ఇప్పుడు టీజర్ వచ్చిన తర్వాత క్లియర్ అయిపోయింది.

ఈ సినిమాలో పెళ్లి కోసం పరితపించే పాత్రలో నరేశ్ కనిపించబోతున్నాడు. ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి సెట్ కాదు. చివరికి ఆంటీ అయినా పర్లేదు అనుకునే పరిస్థితికి వచ్చేస్తారు. అలాంటి సమయంలో నరేశ్ కు ఫరియా అబ్దుల్లాతో పరిచయం ఏర్పడుతుంది. ఆమెనే మనసా వాచా కర్మణా లవ్ చేసేస్తాడు. ఆమె ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటాడు. అయితే ఫరియా మాత్రం ఆ ఒక్కటీ అడగకు అంటూ కండిషన్ పెట్టినట్లు చూపించారు. మరి.. నరేశ్ కు పెళ్లి అవుతుందా? ఫరియా అబ్దుల్లా పెళ్లికి ఒప్పుకుంటుందా? అనే నేపథ్యంలో కథ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అసలు కథ తెలియాలి అంటే సమ్మర్ లో థియేటర్లలో చూడాల్సిందే. మరి.. ఆ ఒక్కటీ అడక్కు సినిమా టీజర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom