Dharani
నాంది తర్వాత వరుసగా అదే జానర్ సినిమాలు చేసిన నరేష్ తన పంథా మార్చుకుని.. పాత దారిలోకి వచ్చి చేసిన సినిమా ఆ ఒక్కటి అడక్కు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందంటే..
నాంది తర్వాత వరుసగా అదే జానర్ సినిమాలు చేసిన నరేష్ తన పంథా మార్చుకుని.. పాత దారిలోకి వచ్చి చేసిన సినిమా ఆ ఒక్కటి అడక్కు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందంటే..
Dharani
అల్లరి నరేష్ అనగానే కామెడీ సినిమాలే గుర్తుకు వస్తాయి. కెరీర్ ప్రారంభం నుంచి ఈ హీరో కామెడీ ఎంటర్‌టైనర్లలోనే యాక్ట్ చేశాడు. అయితే నాంది సినిమాతో తన పంథా మార్చుకున్నాడు. ఆ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో.. అదే జానర్‌లో వరుసగా 2, 3 సినిమాలు చేశాడు. అవి ఆశించిన మేర రాణించకపోవడంతో.. తిరిగి తన పాత ట్రాక్‌లోకి వచ్చేశాడు. ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్ ఎవర్ గ్రీన్ టైటిల్ ఆ ఒక్కటి అడక్కు టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో అల్లరోడు హిట్టు కొట్టాడా లేదా అంటే..
నేటి కాలంలో యువత ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య పెళ్లి. జీవితంలో సెటిల్ అయ్యే వరకు వివాహం చేసుకోవద్దని భావించడం.. ఆ తర్వాత పెళ్లి వయసు దాటి పోవడంతో.. సంబంధాల కోసం వెతకడం కామన్ అయిపోయింది. ఇక ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో గణా(అల్లరి నరేష్) కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటాడు. ఏజ్ బార్ అయినా.. ఇంకా పెళ్లి కాదు. వివాహ ప్రయత్నాల్లో ఉండగా.. సిద్ది(ఫరియా అబ్దుల్లా)తో ప్రేమలో పడతాడు. కానీ ఆమె ఓ మ్యాట్రిమోనియల్ స్కామ్‌లో చిక్కుకుంటుంది. ఇక సిద్దిను సేవ్ చేయడం కోసం గణా ఏం చేశాడో చెప్పడంతో పాటు.. పెళ్లి కాని వారి సమస్యలు ఎలా ఉంటాయి.. మ్యాట్రిమోనియల్ సైట్లు చేసే మోసాలు ఎలా ఉంటాయి అనే అంశాలతో ఆ ఒక్కటి అడక్కు తెరకెక్కింది.
నేటి కాలంలో చాలా మంది యువత ఎదుర్కొనే ప్రధాన సమస్య.. పెళ్లి. వయసైపోతంది.. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావ్.. బ్యాచిలర్స్‌కు ఎదురయ్యే కామన్ ప్రశ్న. దీని ఆధారంగా ఆ ఒక్కటి అడక్కు సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు మల్లి అంకం. యూత్‌కు కనెక్ట్ అయ్యే పాయింట్‌తో సినిమాను ప్రారంభించినప్పటికి.. అల్లరి నరేష్ సినిమాలు అనగానే గుర్తుకు వచ్చే కామెడీ మాత్రం ఈ మూవీలో పెద్దగా వర్కౌట్ కాలేదు. సినిమా సాగుతుంటుంది కానీ.. కామెడీ ఎక్కడా పండలేదు. ఇక ఇంటర్వెల్‌లో ట్విస్ట్ ఉన్నప్పటికి.. అది పెద్దగా కన్విసింగ్‌గా లేదు. ఫస్టాఫ్ అంతా కామెడీ చేయడానికి ప్రయత్నించిన డైరెక్టర్ సెకండాఫ్‌ను సీరియస్ స్టోరీతో నడిపించాడు. మ్యాట్రిమోనియల్ మోసాలను సరిగా వివరించడంలో దర్శకుడు తడబడ్డాడు. ఇక క్లైమాక్స్‌లో మ్యాట్రిమోనియల్ సమస్యలు, స్కామ్‌ల గురించి మంచి సందేశం ఇస్తూ సినిమాను ముగించాడు. కానీ అప్పటికే ప్రేక్షకులు విసుగెత్తిపోయారు. దాంతో పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.
ఇలాంటి కామెడీ పాత్రల్లో నటించడం అల్లరి నరేష్‌కు కొట్టిన పిండి. ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో అదే తరహా పాత్ర కావడంతో చాలా ఈజీగా చేసేశాడు. పెద్దగా కొత్తదనం ఏం లేదు. ఇక ఫరియా అబ్దుల్లా పాత్రకు కూడా పెద్దగా ప్రాధాన్యం లేదు. మిగతా వారు.. వారి వారి పాత్రల పరిధి మేరకు నటించారు.
ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్టర్. కానీ పెద్దగా ఆకట్టుకోలేపోయాడు. సినిమా చూసి బయటకు వచ్చాక ఒక్క సాంగ్ కూడా మనకు గుర్తుండదు. పాటల ప్లేస్‌మెంట్ కూడా సరిగా లేదు. సినిమాటోగ్రఫి పర్వాలేదు. విజువల్‌గా బాగానే ఉంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.