iDreamPost
android-app
ios-app

అఖండ 2 అంతా రెడీనే.. కానీ !

  • Published Sep 24, 2025 | 10:53 AM Updated Updated Sep 24, 2025 | 10:53 AM

నిజానికి ఇప్పుడు టాలీవుడ్ లో అతి పెద్ద క్లాష్ జరగాల్సిన రోజు. ఎందుకంటే అఖండ 2 ముందుగా రిలీజ్ చేస్తామని చెప్పిన రోజు సెప్టెంబర్ 25. కానీ అది పోస్ట్ పోన్ అవ్వడంతో ఓజి సోలో ఎంట్రీ ఇస్తుంది. ఇంత వరకు అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు.

నిజానికి ఇప్పుడు టాలీవుడ్ లో అతి పెద్ద క్లాష్ జరగాల్సిన రోజు. ఎందుకంటే అఖండ 2 ముందుగా రిలీజ్ చేస్తామని చెప్పిన రోజు సెప్టెంబర్ 25. కానీ అది పోస్ట్ పోన్ అవ్వడంతో ఓజి సోలో ఎంట్రీ ఇస్తుంది. ఇంత వరకు అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు.

  • Published Sep 24, 2025 | 10:53 AMUpdated Sep 24, 2025 | 10:53 AM
అఖండ 2 అంతా రెడీనే.. కానీ !

నిజానికి ఇప్పుడు టాలీవుడ్ లో అతి పెద్ద క్లాష్ జరగాల్సిన రోజు. ఎందుకంటే అఖండ 2 ముందుగా రిలీజ్ చేస్తామని చెప్పిన రోజు సెప్టెంబర్ 25. కానీ అది పోస్ట్ పోన్ అవ్వడంతో ఓజి సోలో ఎంట్రీ ఇస్తుంది. ఇంత వరకు అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. డిసెంబర్ 5 రాజసాబ్ వదులుకున్న రోజున ఈ అఖండ 2 రావడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. దీని మీద కొన్ని అనుమానాలైతే ఉన్నాయి. న్ ఇండియా భాషల్లో ఒకేసారి వస్తుందని అసెంబ్లీలో జరిగిన ప్రైవేట్ చిట్ ఛాట్ లో బాలయ్య ఇది చెప్పేయడంతో.. అనుమానపు మబ్బులు వీడిపోయాయి.

నిజానికి ముందు సంక్రాంతి అని కూడా అనుకున్నారు. కాని అప్పుడు చాలానే సినిమాలు రేస్ లో ఉన్నాయి. కాబట్టి డిసెంబర్ 5 అనేది సరైన రిలీజ్ డేట్. సోలో డేట్ మళ్ళీ మళ్లీ దొరకదు. సోలోగా వస్తే ఎలాంటి లాభాలు వస్తాయో కల్కి, దేవర , పుష్ప 2 నిరూపించాయి. ఇప్పుడు ఓజి కూడా ప్రూవ్ చేయనుంది. ప్రస్తుతానికైతే సినిమా అంతా రెడీనే.. దాదాపు గుమ్మడికాయ కొట్టేసినట్టే. విఎఫ్ఎక్స్ వర్క్స్ మాత్రమే కాస్త పెండింగ్ ఉందట.

రిలీజ్ కు ఇంకా రెండు నెలల సమయం ఉంది కాబట్టి.. ఈ పనులన్నీ మెల్లగా పూర్తయిపోతాయి. నవంబర్ కు మొదటి కాపీ రెడీ అయిపోతుంది. షూటింగ్ పనులు కాస్త లేట్ అవ్వడం వలన పోస్ట్ పోన్ అయింది. లేదంటే ఈపాటికి సోషల్ మీడియాలో బిగ్గెస్ట్ క్లాష్ జరుగుతూ ఉండేది. ఇక ఇప్పుడు ఓజి మ్యానియా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చేది అఖండనే. ఇక ముందు ముందు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.