iDreamPost
android-app
ios-app

హాలీవుడ్ యాక్టర్స్ కి తెలుగు నేర్పిస్తున్న అలియా! వీడియో వైరల్!

  • Author ajaykrishna Published - 12:15 PM, Tue - 8 August 23
  • Author ajaykrishna Published - 12:15 PM, Tue - 8 August 23
హాలీవుడ్ యాక్టర్స్ కి తెలుగు నేర్పిస్తున్న అలియా! వీడియో వైరల్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్.. గతేడాది RRR మూవీతో టాలీవుడ్ డెబ్యూ చేసేసింది. సీత క్యారెక్టర్ లో నటించి.. దక్షిణాది ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా ఏకంగా రూ. 1200 కోట్లు వసూల్ చేసి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. అలాగే గంగూబాయ్, బ్రహ్మస్త్ర సినిమాలతో.. ఒకే ఏడాది మూడు బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకుంది. అదే ఊపులో తాను ప్రేమించిన హీరో రణబీర్ కపూర్ ని పెళ్లాడి.. రీసెంట్ ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. బిడ్డ పుట్టాక మళ్లీ సినిమాలలో యాక్టీవ్ అయిన అలియా.. రన్వీర్ సింగ్ సరసన ‘రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని’ మూవీ చేసింది. ఇటీవల విడుదలైన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం నమోదు చేసి.. దూసుకుపోతుంది.

ఇక ఇండియా వైడ్ పరిచయం అక్కర్లేని అలియా.. తన హాలీవుడ్ డెబ్యూకి రెడీ అయిపోయింది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే యాక్షన్ మూవీతో హాలీవుడ్ లో అడుగు పెట్టబోతుంది. వండర్ ఉమెన్ ఫేమ్ గాల్ గాడోట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో.. అలియా కీలక పాత్ర పోషించింది. అయితే.. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాకుండా నేరుగా ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో ఆగష్టు 11 నుండి ఈ ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్బంగా మూవీ ప్రమోషన్స్ లో లీడ్ యాక్టర్స్ తో పాటు అలియా కూడా పాల్గొంది. ప్రస్తుతం వీరి ప్రమోషనల్ స్టఫ్ సినిమాపై అంచనాలైతే క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా.. హార్ట్ ఆఫ్ స్టోన్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ క్రేజీ మూమెంట్ చోటుచేసుకుంది. అదేంటంటే.. హార్ట్ ఆఫ్ స్టోన్ లీడ్ యాక్ట్రెస్ గాల్ గాడోట్ కి అలియా భట్ తనకు తెలిసిన తెలుగు నేర్పించే ప్రయత్నం చేసింది. ఆమె బ్రహ్మాస్త్రం ప్రమోషన్స్ కోసం నేర్చుకున్న ‘అందరికీ నా నమస్కారం! మీకు నా ముద్దులు’ అనే తెలుగు లైన్ ని హీరోయిన్ కి నేర్పించడం విశేషం. అలియా నేర్పించగా.. గాల్ గాడోట్ కష్టమైనా చక్కగా పలికే ప్రయత్నం చేసింది. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ రికగ్నిషన్ సొంతం చేసుకున్న విషయం విదితమే. అప్పటినుండి తెలుగు భాషకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిందని చెప్పాలి. ప్రస్తుతం అలియా తన కోయాక్టర్ కి తెలుగు నేర్పిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అలియా భట్ తెలుగు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetpark girişgrandpashabet