iDreamPost
android-app
ios-app

Alia Bhatt-Ranbir Kapoor wedding మోస్ట్ వెయిటెడ్ సెలబ్రిటీ వెడ్డింగ్

  • Published Apr 06, 2022 | 7:23 PM Updated Updated Apr 06, 2022 | 7:23 PM
Alia Bhatt-Ranbir Kapoor wedding మోస్ట్ వెయిటెడ్ సెలబ్రిటీ వెడ్డింగ్

ఇటీవలే విడుదలైన ఆర్ఆర్ఆర్ లో రామరాజు జోడి సీతగా మెప్పించిన అలియా భట్ అతి త్వరలోనే పెళ్లి కూతురు కానుంది. ఏప్రిల్ 13 నుంచి 17 వరకు గ్రాండ్ సెలబ్రేషన్స్ ని రెండు కుటుంబాల వారూ ప్లాన్ చేశారు. పెళ్లి కొడుకు రణబీర్ కపూర్ ఫ్యామిలీ అన్ని ఏర్పాట్లు చేసి రెడీ అవుతోంది. ముంబై వేదికగా ఈ గ్రాండ్ ఈవెంట్ జరగనుంది. రణబీర్ స్వంత ఊరు చెంబూర్ లో ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ హంగామా మొదలైపోయింది. రిషి కపూర్ మరణం తర్వాత ఆ ఇంట శుభకార్యం జరగలేదు. మళ్ళీ ఈ ఫంక్షన్ తో మునుపటి కళను తేబోతున్నారు. సంగీత్ మెహందీ తదితర కార్యక్రమాలు ఎప్పుడు ఎక్కడ జరుగుతాయనేది ఇంకా తెలియాల్సి ఉంది.

అలియా భట్ కెరీర్ మంచి పీక్స్ లో ఉంది. గంగూబాయ్ కటియావాడి సూపర్ హిట్ కావడం వెంటనే ట్రిపులార్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడం చకచకా జరిగిపోయాయి. ఈ ఇద్దరూ కలిసి నటించిన బ్రహ్మాస్త్ర త్వరలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. నాగార్జున స్పెషల్ క్యామియో చేసిన ఈ చిత్రానికి రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. కరణ్ జోహార్ వందల కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ మెగా మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 9 గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం చేశారు. ఇక రణబీర్ కపూర్ కమిట్ మెంట్స్ చూస్తే ప్రధానంగా అనిమల్ మీదే అందరి దృష్టి ఉంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్.

ప్రియాంకా చోప్రా తర్వాత అంతకు మించి అభిమానులు ఎదురు చూస్తున్న బాలీవుడ్ సెలబ్రిటీ వెడ్డింగ్ ఇదే అవుతుంది. ఇప్పటికే ఆహ్వానాలు అందరికీ వెళ్లిపోయాయి. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళిలతో పాటు ఆర్ఆర్ఆర్ టీమ్ కీలక సభ్యులంతా హాజరు కాబోతున్నారు. రిసెప్షన్ తాలూకు వెన్యూ తదితర వివరాలు ఇంకా మీడియాకు ఇవ్వలేదు. పెళ్ళయాక అలియా భట్ నటించే తెలుగు సినిమా తారక్ దే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే యాక్షన్ ఎంటర్ టైనర్ జూన్ లేదా జులైలో మొదలు కానుంది. ఆలోగా హానీమూన్ తదితర ముచ్చట్లు అయిపోయి ఉంటాయి కాబట్టి డేట్ల ఇబ్బంది ఉండదు. సో లెట్ వెయిట్ అండ్ సి

Jojobet GirişMadridbetMadridbetbetciomatbet girişgrandpashabetDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren Sitelerdeneme bonusugrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet