iDreamPost
android-app
ios-app

చీపురుతో చెత్త శుభ్రం చేసిన స్టార్ హీరో.. ఎందుకంటే!

  • Published Oct 03, 2023 | 11:10 AM Updated Updated Oct 03, 2023 | 11:10 AM
  • Published Oct 03, 2023 | 11:10 AMUpdated Oct 03, 2023 | 11:10 AM
చీపురుతో చెత్త శుభ్రం చేసిన స్టార్ హీరో.. ఎందుకంటే!

సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు.
1991లో సౌగంధ్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయిన అక్షయ్ కుమార్ తర్వాత ఖిలాడీ చిత్రంతో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. హీరోగానే కాకుండా పలు యాడ్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా అక్షయ్ కుమార్ చీపురు పట్టి చెత్త శుభ్రం చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

పాన్ ఇండియా హీరో అక్షయ్ కుమార్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు అవుతుంది. ఆ మద్య శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించిన 2.0 మూవీలో విలన్ గా నటించి దక్షిణాది ప్రేక్షకులను అలరించారు. కెరీర్ లో ఎన్నో అవార్డు రివార్డులు గెల్చుకున్న అక్షయ్ కుమార్ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కొంతకాలంగా అక్షయ్ కుమార్  వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. ఇటీవల ఆయన నటించిన OMG 2 మూవీ కాస్త పరవాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ చీపురు పట్టి శుభ్రం చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్చతా హి సేవా కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశంలో ప్రముఖులు స్వచ్చందంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్షయ్ కుమార్ చీపురు చేతబట్టి బీచ్ లో ఉన్న చెత్త శుభ్రం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై అభిమానులు రక రకాలుగా స్పందిస్తున్నారు. మీరు ఇండియాలో లేరు.. ఇక్కడ కూడా పరిసరాల పరిశుభ్రతపై కాస్త గట్టిగా ఫోకస్ చేయండి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş