iDreamPost
android-app
ios-app

కన్నప్ప కోసం అక్షయ్‌ కుమార్‌కు అన్ని కోట్ల రెమ్యూనరేషనా?

  • Published May 05, 2024 | 6:19 PM Updated Updated May 05, 2024 | 6:19 PM

Akshay Kumar Remuneration:మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో స్టార్ హీరోలు ప్రభాస్, అక్షయ్ కుమార్ లు నటిస్తున్నారు.

Akshay Kumar Remuneration:మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో స్టార్ హీరోలు ప్రభాస్, అక్షయ్ కుమార్ లు నటిస్తున్నారు.

  • Published May 05, 2024 | 6:19 PMUpdated May 05, 2024 | 6:19 PM
కన్నప్ప కోసం అక్షయ్‌ కుమార్‌కు అన్ని కోట్ల రెమ్యూనరేషనా?

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతోమంది స్టార్ హీరోల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ అతి కొద్దిమందే సక్సెస్ సాధించారు. విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు, మంచు మనోజ్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  ప్రస్తుతం మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ షర వేగంగా జరుగుతుంది. ఇటీవల ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా మంచి స్పందన వస్తుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న అక్షయ్ కుమార్ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు నటించిన చిత్రాల్లో ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా లాంటి సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. అవి మినహాయిస్తే ఏ సినిమాలు పెద్దగా సక్సెస్ టాక్ తెచ్చుకోలేదు.ప్రస్తుతం ‘మా’ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కొనసాగుతూనే సినిమాల్లో నటిస్తున్నారు మంచు విష్ణు. ఈ క్రమంలోనే ‘కన్నప్ప’ లాంటి మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ బాధ్యతలు మంచు మోహన్ బాబు స్వీకరించి ప్రతి విషయాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు ఎలాంటి అంచనాలు లేవు. కానీ ఎప్పుడైతే ప్రభాస్ ఎంట్రీ ఇస్తున్నారన్న వార్తలు వచ్చాయి ‘కన్నప్ప’ పై అంచనాలు పెరిగిపోయాయి.

కన్నప్ప మూవీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మైతలాజికల్ ఫిక్షనల్ మూవీలో ప్రభాస్ శివుడి పాత్రలో అదరగొట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కన్నప్పకు సంబంధించిన ప్రతి అప్ డేట్ ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కృష్ణం రాజు నటించిన భక్త కన్నప్ప మూవీకి రిమేక్ గా ఈ సినిమా రాబోతుంది. ఇదిలా ఉంటే కన్నప్ప మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నాను.ఈ మద్యనే పది రోజులు షూటింగ్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందుకోసం చిత్ర బృందం అక్షయ్ కుమార్ కోసం భారీగానే రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కన్నప్ప మూవీ కోసం అక్షయ్ కుమార్ 6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss