iDreamPost
android-app
ios-app

కింగ్ మాస్ అవతారం ఎత్తితే ఇలా ఉంటది.. ‘నా సామిరంగ’ టైటిల్ వీడియో వైరల్!

  • Author ajaykrishna Updated - 01:53 PM, Tue - 29 August 23
  • Author ajaykrishna Updated - 01:53 PM, Tue - 29 August 23
కింగ్ మాస్ అవతారం ఎత్తితే ఇలా ఉంటది.. ‘నా సామిరంగ’ టైటిల్ వీడియో వైరల్!

టాలీవుడ్ లో కింగ్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. ఓవైపు ఫ్యాన్స్ నాగ్ సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసుకుంటూ పండగ చేసుకుంటుంటే.. మరోవైపు ఇండస్ట్రీ ప్రముఖులు, మిగతా ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇవే కాకుండా నాగ్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ మరింత ఆసక్తికరంగా మారింది. ఇలాంటి తరుణంలో కొత్త సినిమా టైటిల్ తో పాటు నాగ్ కొత్త లుక్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈసారి యంగ్ డైరెక్టర్ నాగ్ తో ‘నా సామిరంగ’ అనే సినిమా తీస్తున్నాడు. మాస్ యాక్షన్ మూవీగా రాబోతున్న ఈ మూవీలో.. నాగ్ లుక్ చూస్తే పక్కాగా గూస్ బంప్స్ గ్యారంటీ అనిపించాడు.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా.. విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నాడు. ఫిట్నెస్ లో కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్న నాగ్.. ఇప్పుడు కొంచం గ్యాప్ తీసుకొని ఈ సినిమా ప్లాన్ చేశాడు. నాగ్ కెరీర్ లో నా సామిరంగా.. 99వ సినిమా కావడం విశేషం. ఈసారి నాగ్ ని నెక్స్ట్ లెవెల్ మాస్ అవతారంలో ప్రెజెంట్ చేస్తున్నాడు కొత్త దర్శకుడు. ఇదివరకు పంచకట్టు లుక్కులో కనిపించినా.. ఊరమాస్ యాక్షన్ ఏం చేయలేదు. ఈసారి మాత్రం ఊహించని విధంగా.. యాక్షన్ ఉండబోతుందని గ్లింప్స్ చూస్తే అర్ధమవుతుంది. ఈసారి పండక్కి నా సామిరంగా.. అంటూ నాగ్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది.

మరి సినిమాకు సంబంధించి మిగతా కాస్ట్ డీటెయిల్స్ బయటికి రాలేదు. కానీ.. డైరెక్టర్ కరుణకుమార్ గ్లింప్స్ లో విలన్ గా కనిపించడం సర్ప్రైజ్. ఇక ఈ సినిమాకు ధమాకా, ధమ్కి ఫేమ్ ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నాడు. ఈ సినిమానే నాగ్ మరో క్రేజీ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఈ విషయాన్నీ స్వయంగా నిర్మాతలే ప్రకటించారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా దర్శకుడు శేఖర్ కమ్ములతో ఓ సినిమా నిర్మిస్తున్నారు. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నాగ్ కీలక పాత్రలో నటించడానికి అంగీకరించాడట. అందుకు సినిమా టీమ్ తరపున నాగ్ కు బర్త్ డే విషెస్ తెలిపిన నిర్మాతలు.. నాగ్ శేఖర్ కమ్ముల మూవీలో నటిస్తున్నాడనే విషయాన్నీ కన్ఫర్మ్ చేశారు. ఈ విషయం తెలిసి నాగ్ ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు. ఇక తెరపై నాగ్, ధనుష్ ల కాంబో ఎలా ఉండబోతుందో చూడాలి. మరి నాగ్  కొత్త మూవీ నా సామిరంగా గ్లింప్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss