iDreamPost
android-app
ios-app

N కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేయడంపై స్పందించిన నాగార్జున! ఏమన్నారంటే..

  • Published Aug 24, 2024 | 1:15 PM Updated Updated Aug 24, 2024 | 1:51 PM

Akkineni Nagarjuna, N Convention, HYDRAA: మదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై సినీ హీరో అక్కినేని నాగార్జున సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం...

Akkineni Nagarjuna, N Convention, HYDRAA: మదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై సినీ హీరో అక్కినేని నాగార్జున సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం...

  • Published Aug 24, 2024 | 1:15 PMUpdated Aug 24, 2024 | 1:51 PM
N కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేయడంపై స్పందించిన నాగార్జున! ఏమన్నారంటే..

మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై హీరో నాగార్జున స్పందించారు. ఈ రోజు ఉదయం నుంచి.. ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ కూల్చివేత పనులను హైడ్రా చేపట్టిన విషయం తెలిసిందే. భారీ బందోబస్తు నడుమ ఈ కార్యక్రమం చేపట్టింది. అయితే.. ఈ ఎన్‌ కన్వెన్షన్‌ ప్రముక హీరో నాగార్జునది కావడంతో ఉదయం నుంచి ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే.. తాజాగా తనకు సంబంధించిన ఈ ఎన్‌ కన్వెన్షన్‌ను ప్రభుత్వం కూల్చివేయడంపై నాగార్జున స్పందిస్తూ.. ఒక ప్రకటన విడుదల చేశారు.

‘స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం, చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలియజేసేందుకు ఈ ప్రకటన విడుదల చేయడం సరైనదని నేను భావించాను. ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా ఉంది. స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది.

ఈ రోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని. తాజా పరిణామాల వల్ల, మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను.’ అంటూ నాగార్జున పేర్కొన్నారు. మరి ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత, దానిపై నాగార్జున స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş