iDreamPost
android-app
ios-app

డియర్‌ అంటూ.. హీరో కార్తీపై అక్కినేని నాగార్జున ప్రశంసలు!

  • Published Sep 30, 2024 | 1:49 PM Updated Updated Sep 30, 2024 | 1:49 PM

Akkineni Nagarjuna, Karthi, Satyam Sundaram: కింగ్‌ నాగార్జున.. తమిళ హీరో కార్తీపై ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా ఒక ట్వీట్‌ చేసిన నాగార్జున సత్యం సుందరం మూవీ గురించి మాట్లాడాడు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Akkineni Nagarjuna, Karthi, Satyam Sundaram: కింగ్‌ నాగార్జున.. తమిళ హీరో కార్తీపై ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా ఒక ట్వీట్‌ చేసిన నాగార్జున సత్యం సుందరం మూవీ గురించి మాట్లాడాడు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Sep 30, 2024 | 1:49 PMUpdated Sep 30, 2024 | 1:49 PM
డియర్‌ అంటూ.. హీరో కార్తీపై అక్కినేని నాగార్జున ప్రశంసలు!

తెలుగు కుర్రాడిలా కనిపించే తమిళ హీరో కార్తీకి.. టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. చాలా ఏళ్లుగా కార్తీ సినిమాలను తెలుగు సినిమా అభిమానులు ఆదరిస్తూ వస్తున్నారు. తాజాగా ‘సత్యం సుందరం’ సినిమాతో కార్తీ మరోసారి తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు. ఒకవైపు సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ అయిన దేవర వసూళ్ల సునామీ సృష్టిస్తున్న టైమ్‌లోనే.. దేవరకు పోటీగా సెప్టెంబర్‌ 28న సత్యం సుందరం రిలీజ్‌ అయింది. దేవరతో పాటు సత్యం సుందరం సినిమాకు కూడా మంచి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. సినిమా సూపర్‌గా ఉందని, ఒక్కసారిగా మన సొంతూళ్లు గుర్తుకు వచ్చేస్తాయంటూ.. చాలా మంది నెటిజన్లు సోషల్‌ మీడియాలో మూవీపై తన ఒపీనియన్‌ చెబుతున్నారు.

తాజాగా హీరో నాగార్జున సైతం.. సత్యం సుందరం సినిమా చూసి.. కార్తీకి ఒక స్పెషల్‌ మేసేజ్‌ పంపించారు. మూవీ చూసి.. ట్వీట్‌ చేశారు కింగ్‌ నాగార్జున. ‘డియర్ కార్తీ, నిన్న రాత్రి సత్యంసుందరం సినిమా చూశాను.. నువ్వు, అరవింద్ స్వామీ అద్భుతంగా నటించారు.. సినిమాను చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను.. అదే హ్యాపినెస్‌తో హాయిగా నిద్రపోయాను. మూవీ చూస్తూ.. ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉన్నాను.. అలానే మన ఊపిరి జ్ఞాపకాలను నెమరవేసుకున్నాను. ప్రజలు, క్రిటిక్స్‌ ఈ మూవీని మంచి చిత్రమని అభినందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. టీంకు ఆల్ ది బెస్ట్’ అంటూ నాగ్‌ పేర్కొన్నారు. దేవర క్రేజ్‌ ముందు సత్యం సుందరం టాక్‌కు తగ్గట్లు కలెక్షన్స్‌ మాత్రం రావడంలేదు. అయితే.. ఇప్పుడు నాగార్జున ఇచ్చిన స్వీట్‌ అండ్‌ షార్ట్‌ రివ్యూతో ఈ మూవీ కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి.

కాగా, నాగార్జున ఇచ్చిన స్పెషల్‌ మేసెజ్‌కు వెంటనే కార్తీ కూడా రియాక్ట్‌ అయ్యాడు. ‘థ్యాంక్యూ సో మచ్‌ అన్నయ్య. మీ మాటలు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. మీరు సినిమాను ఆస్వాదించినందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి సినిమాపై మీ ప్రశంసలు మరింత బెటర్‌గా పనిచేసేందుకు మాకు నిరంతరం స్ఫూర్తినిస్తాయి.’ అని పేర్కొన్నాడు. ఇలా ఊపిరిలో కలిసి నటించిన ఈ ఇద్దరు స్టార్లు ఇప్పుడు మరోసారి.. సత్యం సుందరంతో సోషల్‌ మీడియాలో ముచ్చటించుకున్నారు. ఇక నాగార్జున రివ్యూ తర్వాత అయినా.. సత్యం సుందరం టాక్‌కు తగ్గట్లు కలెక్షన్స్‌ వస్తాయో రావో చూడాలి. మరి కార్తీని, సత్యం సుందరం మూవీని నాగార్జున మెచ్చుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet