Somesekhar
KGF యూనివర్స్ లోకి రాబోతున్నాడు తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్. ఇందుకు సంబంధించిన న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
KGF యూనివర్స్ లోకి రాబోతున్నాడు తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్. ఇందుకు సంబంధించిన న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
కేజీఎఫ్.. కన్నడ స్టార్ హీరో యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విడుదలకు ముందు ఈ మూవీపై ఎలాంటి అంచనాలు లేవు. కానీ.. రిలీజ్ తర్వాత థియేటర్ల దగ్గర ఈ చిత్రం సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. యశ్ ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ కాగా.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరాడు. ఇక ఈ తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2 కూడా అత్యధిక కలెక్షన్లు సాధించి.. రికార్డులు నెలకొల్పింది. ఇక పార్ట్ 3 ఉంటుందని హింట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్.
కేజీఎఫ్ మూవీస్ తో తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇక ఇప్పుడు కేజీఎఫ్ 3 కథను రెడీ చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక పార్ట్ 3లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ను హీరోగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ చేయడంలో అజిత్ సిద్ధహస్తుడు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే కేజీఎఫ్ సిరీస్ లో భాగంగా రెండు భాగాలను అజిత్ హీరోగా రూపొందించడానికి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట. రెండో భాగంలో కథ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి పార్ట్ 3 స్టార్ట్ అవ్వబోతుంది.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ మూవీ చేస్తున్నాడు. మరోపక్క ప్రభాస్ తో సలార్ 2 ఉండనే ఉంది. ఈ రెండు చిత్రాలు పూర్తి చేసిన తర్వాత కేజీఎఫ్ సిరీస్ తెరకెక్కుతుందా? లేదా ముందే పట్టాలెక్కిస్తాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి కేజీఎఫ్ 3, 4 కోసం అజిత్ ను హీరోగా తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ajith Kumar and Prashanth Neel collaborating for #AK64 is already mind-blowing, but hearing that #AK65 climax will lead to KGF 3 is next-level excitement! Can’t wait! 🔥💥 #AjithKumar #PrashanthNeel #KGF3 #Kollywood #Sandalwood #IndianCinema #BlockbusterAlert #EpicCollaboration pic.twitter.com/3wDxGlkooK
— UiTV Connect (@UiTV_Connect) July 24, 2024