Aditya N
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఓ అరుదైన రికార్డు సృష్టించాడు. ఎవరికీ అందని ఓ రేర్ ఫీట్‌ను ఆయన అందుకున్నాడు.
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఓ అరుదైన రికార్డు సృష్టించాడు. ఎవరికీ అందని ఓ రేర్ ఫీట్‌ను ఆయన అందుకున్నాడు.
Aditya N
2020లో కరోనా దాడి తర్వాత భారత సినీ పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. మునుపటిలా సాధారణ కంటెంట్ ఉన్న సినిమాలు కాకుండా ఎక్కువగా గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ సినిమాలు లేదా సినిమాటిక్ యూనివర్స్ తరహా సినిమాలకే ఎక్కువ ఆదరణ దక్కుతుందనే నమ్మకం అందరిలోనూ బలపడింది. కాగా, కొవిడ్ అనంతరం రీమేక్ లు అస్సలు వర్కవుట్ కావనే విషయం అందరికీ అర్థమైంది. థియేటర్లు మూసేసిన రోజుల్లో ఓటీటీలో ప్రేక్షకులు అన్ని భాషల చిత్రాలు చూడటానికి అలవాటు పడడంతో అన్ని ఇండస్ట్రీల్లో రీమేక్లను ప్రేక్షకులు తిరస్కరించారు. అయితే బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్ మాత్రం ఈ ఫార్ములాకి భిన్నంగా రీమేక్లతోనే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నారు.
గత కొంతకాలంగా బాలీవుడ్ లో వచ్చిన రీమేక్ సినిమాల ఫలితాలని కనుక గమనిస్తే.. ‘బచ్చన్ పాండే’, ‘లాల్ సింగ్ చద్దా’, ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’, ‘షెహజాదా’ వంటి ఫిల్మ్స్ డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక టాలీవుడ్ లో కూడా ‘గాడ్ ఫాదర్’, ‘ఓరి దేవుడా’, ‘భోళా శంకర్’.. ఇలా ఎన్నో ఫ్లాప్స్ వచ్చాయి. దీంతో ఎలా ఉన్నా సరే రీమేక్ లు నేటి రోజుల్లో ఏమాత్రం సేఫ్ బెట్ కావని ట్రేడ్ వర్గాల వారు కూడా ఫిక్స్ అయ్యారు. అయితే రీమేక్ సినిమాలతో ఒకటి కాదు ఏకంగా రెండు సూపర్ హిట్ సినిమాలను ఓటీటీ యుగంలో అందించి అరుదైన రికార్డు సాధించారు అజయ్ దేవగణ్. 2022లో వచ్చిన ‘దృశ్యం 2’ బాక్సాఫీస్ వద్ద సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ 2023లో ఆయన నటించిన ఖైదీ రీమేక్ ‘భోలా’ బిలో యావరేజ్ అయింది. మళ్ళీ తాజాగా ఆయన నటించిన షైతాన్ (గుజరాతీ సినిమా ‘వష్’ రీమేక్) బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది.
ఓ మోస్తరు బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ‘షైతాన్’. ఈ సినిమా తొలిరోజే 15 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కమర్షియల్ ఎలిమెంట్స్, సూపర్ హిట్ సాంగ్స్ లేకుండా ఒక రీమేక్ సినిమా ఈ స్థాయిలో ఓపెనింగ్ సాధించడం నిజంగా అద్భుతమనే చెప్పాలి. సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రేక్షకులకి బాగా నచ్చడంతో ఈ సినిమాను పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. సెకండ్ డే కలెక్షన్స్ భారీగా పెరిగాయి. ఇక ఈ రోజు కూడా బిగ్ ఆక్యుపెన్సీలను నమోదు చేసి ఫస్ట్ వీకెండ్ లో సుమారు 60 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించే దిశగా దూసుకెళ్తున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
అజయ్ దేవగణ్ – బాలీవుడ్ న్యూ ట్రెండ్ సెట్టర్