iDreamPost
android-app
ios-app

Aishwarya Rajinikanth: ఒంటరి జీవితమే బాగుంది.. ఐశ్వర్య రజినీకాంత్ షాకింగ్ కామెంట్స్!

  • Published Feb 11, 2024 | 5:15 PM Updated Updated Feb 11, 2024 | 5:15 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒంటరిగా ఉండటమే బాగుందంటూ.. చెప్పుకొచ్చింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒంటరిగా ఉండటమే బాగుందంటూ.. చెప్పుకొచ్చింది.

  • Published Feb 11, 2024 | 5:15 PMUpdated Feb 11, 2024 | 5:15 PM
Aishwarya Rajinikanth: ఒంటరి జీవితమే బాగుంది.. ఐశ్వర్య రజినీకాంత్ షాకింగ్ కామెంట్స్!

ధనుష్-ఐశ్వర్య రజినీకాంత్ కోలీవుడ్ లో ఈ దంపతులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ధనుష్ కు ఎలాగో స్టార్ హీరో ఇమేజ్ ఉండనే ఉండగా.. ఇక ఐశ్వర్యకు స్టార్ కిడ్ ముద్ర ఉంది. సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురిగానే కాకుండా.. డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవాలని ఎప్పటినుంచో కలలు కంటూ వస్తోంది. తాజాగా ఆమె దర్శకత్వం వహించిన లాల్ సలామ్ మూవీలో తలైవా ఓ కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ చిత్రాన్ని అనుకున్నంతగా రెస్పాన్స్ రాలేదు. ఇదంతా కాసేపు పక్కన పెడితే.. ఈ మూవీ ప్రమోషన్స్ లో ఐశ్వర్య పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు ఒంటరి జీవితమే బాగుందని, ఇలా బతకడమే ఈజీ అంటూ చెప్పుకొచ్చింది.

ధనుష్-ఐశ్వర్య రజినీకాంత్ 2004లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు లింగ, యాత్ర అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక దాదాపు 18 సంవత్సరాల పాటు వీరి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగింది. కానీ అనూహ్యంగా 2022లో తాము విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. అయితే ఈ జంట విడాకులు తీసుకోలేదు గానీ.. వేరుగా ఉంటున్నారు. ధనుష్ సినిమాలతో బిజీగా ఉంటే.. ఐశ్వర్య దర్శకత్వంలో బిజీగా ఉంది. ఇక ఆమె లేటెస్ట్ గా డైరెక్షన్ చేసిన సినిమా ‘లాల్ సలామ్’. ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ కీలక పాత్రలో నటించాడు. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ దారుణమైన వసూళ్లను రాబట్టింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న ఐశ్వర్య ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చింది.

“గడిచిన రెండేళ్లుగా నేను ఒంటరిగానే జీవిస్తున్నాను. అయితే ఈ సింగిల్ లైఫ్ ను ఎంతో చక్కగా ఆస్వాదిస్తున్నాను. ఈ రెండు సంవత్సరాల్లో నేను గ్రహించిన విషయం ఏంటంటే? మనం ఒంటరిగా ఉన్నప్పుడే మరింత సురక్షితంగా ఉండగలం. ప్రస్తుతం నాకు ఇలాగే బాగుంది. పిల్లల కోసం గతంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చాను. కానీ ప్రపంచం చాలా ఫాస్ట్ గా పరిగెడుతోంది. అసలు టైమే తెలియడం లేదు. సింగిల్ లైఫ్ లాక్కురావడమే ఈజీగా ఉంది” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఐశ్వర్య రజినీకాంత్. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో.. ఇటు రజినీ అభిమానులు, అటు ధనుష్ అభిమానులు తీవ్ర నిరాశకు గురైయ్యారు. ఎప్పటికైనా వీరిద్దరు కలుస్తారని ఆశలు పెట్టుకున్న అభిమానులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. మరి ఐశ్వర్య కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

ఇదికూడా చదవండి: SSMB 29: మహేష్-రాజమౌళి మూవీలో ఇండోనేషియా బ్యూటీ ఫిక్స్.. ఇదిగో ప్రూఫ్!

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio