iDreamPost

SSMB 29: మహేష్-రాజమౌళి మూవీలో ఇండోనేషియా బ్యూటీ ఫిక్స్.. ఇదిగో ప్రూఫ్!

SSMB 29 మూవీకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ మూవీలో మహేష్ కు జోడీగా ఇండోనేషియాకు చెందిన ఓ బ్యూటీని తీసుకున్నట్లు సమాచారం. దానికి ఫ్రూఫ్ కూడా ఉందంటున్నారు నెటిజన్లు.

SSMB 29 మూవీకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ మూవీలో మహేష్ కు జోడీగా ఇండోనేషియాకు చెందిన ఓ బ్యూటీని తీసుకున్నట్లు సమాచారం. దానికి ఫ్రూఫ్ కూడా ఉందంటున్నారు నెటిజన్లు.

SSMB 29: మహేష్-రాజమౌళి మూవీలో ఇండోనేషియా బ్యూటీ ఫిక్స్.. ఇదిగో ప్రూఫ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ చిత్రం రానున్న విషయం అందరికి తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ అండ్ అడ్వెంచరల్ మూవీగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించాని చూస్తున్నాడు జక్కన్న. అందుకోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాడు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించనున్నట్లు వార్తలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా మరో క్రేజీ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ మూవీలో మహేష్ కు జోడీగా ఇండోనేషియాకు చెందిన ఓ బ్యూటీని తీసుకున్నట్లు సమాచారం. దానికి ఫ్రూఫ్ కూడా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్.. ప్రస్తుతం ఈ పేరు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అమెరికాలో పుట్టి.. ఇండోనేషియాలో స్టార్ యాక్టర్ గా కొనసాగుతున్న ఈమె టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారడం ఏంటని మీకు అనుమానం రావొచ్చు. దానికీ ఓ బలమైన కారణమే ఉంది. అదేంటంటే? మహేష్-రాజమౌళి కాంబోలో ఓ అడ్వెంచరల్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా హాలీవుడ్ కోటలను బద్దలుకొట్టాలనే ఉద్దేశంతో జక్కన్న ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నాడు. మరి హాలీవుడ్ రేంజ్ అంటే.. ఆ తరహాలోనే ఉండాలి కదా క్యాస్టింగ్. అందుకే అందరి అంచనాలను మించేలా నటీ, నటులను ఎంపిక చేసే పనిలో పడ్డాడు జక్కన్న.

అందులో భాగంగానే ఈ చిత్రంలో మహేష్ కు జోడీగా ఇండోనేషియా బ్యూటీ చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ ను ఎంపిక చేశాడని వార్తలు వైరల్ గా మారాయి. అయితే ఈ 28 ఏళ్ల అందాల భామ.. సూపర్ స్టార్ కు జోడీగా నటిస్తుందా? లేక ఏదైన కీలక పాత్ర పోషిస్తుందా? అనేది చూడాలి. ఇక ఆమె ఈ చిత్రంలో నటిస్తోంది అని చెప్పడానికి గట్టి ఫ్రూఫ్ నే చూపిస్తున్నారు నెటిజన్లు. చెల్సియాను రాజమౌళి సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ లో భాగం కానిదే ఆమెను ఎందుకు ఫాలో అవుతున్నాడు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా కరస్టే కదా అంటూ మరికొందరు సమర్థిస్తున్నారు.

అమెరికాలో పుట్టిన ఈ చిన్నది ఇండోనేషియా సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగింది. రూడి హబిబీ, డి బాలిక్, ఏ కాపీ ఆఫ్ మైండ్, మే ది డెవిల్ టేక్ యూ లాంటి సినిమాలతో గుర్తింపుతెచ్చుకుంది. అయితే ఆమెను ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కు ఎంపిక చేశారు అన్నదానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. సినిమా షూటింగ్ ఏప్రిల్ లో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. మూవీ స్టార్టింగ్ కు ముందే.. జక్కన్న ఓ ప్రెస్ మీట్ పెట్టి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీకి వర్గాలు పేర్కొంటున్నాయి. వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ మూవీని 2026 చివర్లో లేదా.. 2027 ప్రారంభంలో విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

ఇదికూడా చదవండి: Real Iron Man suit: వీడియో: రియల్ ఐరన్ మ్యాన్ సూట్ ను రూపొందించిన యూట్యూబర్.. చూస్తే దిమ్మతిరిగిపోద్ది!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి