iDreamPost
android-app
ios-app

కోలీవుడ్ యంగ్ హీరోతో ఐశ్వర్య రజినీకాంత్ సెకండ్ మ్యారేజ్..?

  • Author ajaykrishna Published - 11:51 AM, Mon - 10 July 23
  • Author ajaykrishna Published - 11:51 AM, Mon - 10 July 23
కోలీవుడ్ యంగ్ హీరోతో ఐశ్వర్య రజినీకాంత్ సెకండ్ మ్యారేజ్..?

తమిళ ఇండస్ట్రీలో సూపర్ పెయిర్ గా పేరొందిన స్టార్ కపుల్ హీరో ధనుష్ – ఐశ్వర్య రజినీకాంత్. సూపర్ స్టార్ రజినీ తనయ ఐశ్వర్య.. హీరో ధనుష్ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి.. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. అలాంటిది సడన్ గా ఏమైందో గాని.. కొంతకాలం క్రితమే ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. దాదాపు 18 ఏళ్ల వివాహ బంధానికి ధనుష్, ఐశ్వర్య ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో పక్కా కారణాలు తెలియలేదు. కానీ.. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయారని టాక్. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. విడాకులకు ముందునుండి వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు.

విడాకుల అనంతరం ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ ఎవరి లైఫ్ లో వారు బిజీ అయిపోయారు. అయితే.. తన సొంత టాలెంట్ తో పైకి వచ్చిన సూపర్ స్టార్ రజినీ అల్లుడుగా ధనుష్ కూడా ఇండస్ట్రీలో మంచి పేరు, గుర్తింపు దక్కించుకున్నాడు. సూపర్ స్టార్ కి అల్లుడుగా మరింత గౌరవం కూడా పొందాడు. కానీ.. సడన్ గా ఐశ్వర్యతో విడాకులు అయ్యేసరికి ఫ్యాన్స్ అంచనాలన్ని పటాపంచలు అయిపోయాయి. ఓవైపు ధనుష్ చేతినిండా సినిమాలు చేసుకుంటూ బిజీ కాగా.. ఐశ్వర్య తన దర్శకత్వంలో తదుపరి సినిమాలు లైన్ చేసుకుంటోంది. వీరిద్దరూ కూడా పిల్లల బాధ్యతలను చక్కగా నిర్వర్థిస్తున్నారు. విడిపోయినప్పటికీ ధనుష్, ఐశ్వర్య మంచి ఫ్రెండ్స్ గా అయితే మెలుగుతున్నారట.

దీంతో ఐశ్వర్య ధనుష్ కాస్త విడాకుల తర్వాత మళ్లీ ఐశ్వర్య రజినీకాంత్ అయ్యింది. అదిగాక ఈ మధ్యకాలంలో విడిపోయాక రెండో పెళ్లిళ్లు చేసుకోవడం మామూలే అయిపోయింది. సో.. ఇప్పుడు అదే బాటలోకి ఐశ్వర్య కూడా చేరుతున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఐశ్వర్య త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుందట. అలాగే ఆమె చేసుకోబోయే వరుడు కూడా ఇండస్ట్రీకి చెందినవాడే అని టాక్. పైగా ఐశ్వర్య చేసుకోబోయే వ్యక్తి.. కోలీవుడ్ లో హీరోగా రాణిస్తున్నాడని వినికిడి. ఒకవేళ అదే నిజమైతే.. ప్రేక్షకులు షాక్ అయ్యే అవకాశం లేకపోలేదు. ప్రెజెంట్ అయితే.. ఐశ్వర్య సెకండ్ మ్యారేజ్ గురించి వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరి త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by WAWA ORIGINALS (@wawa_originals)