iDreamPost
android-app
ios-app

ఐశ్వర్య లాంటి కళ్లు కావాలంటే చేపలు తినండి.. మంత్రి కామెంట్స్!

  • Author singhj Published - 01:02 PM, Tue - 22 August 23
  • Author singhj Published - 01:02 PM, Tue - 22 August 23
ఐశ్వర్య లాంటి కళ్లు కావాలంటే చేపలు తినండి.. మంత్రి కామెంట్స్!

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అందంతో ఆకర్షించేవారు కొందరు ఉంటే, అభినయంతో కట్టిపడేసేవారు మరికొందరు ఉన్నారు. కానీ అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినవారు అతికొద్ది మందే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. ఐదు పదుల వయసుకు చేరువవుతున్నా వన్నెతగ్గని అందంతో మెస్మరైజ్ చేస్తున్నారు ఐష్. రోజురోజుకీ ఆమె మరింత గ్లామరస్​గా తయారవుతూ కుర్ర హీరోయిన్లకు షాక్ ఇస్తున్నారు.

ఐశ్వర్యారాయ్ ఇండస్ట్రీలోకి వచ్చి పాతికేళ్లు దాటిపోయింది. అయినా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. తొలి చిత్రం ‘ఇరువుర్​’లో ఎలా ఉన్నారో ఈ మధ్య వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్​’లోనూ అలాంటి అందంతోనే కనిపిస్తూ ఫ్యాన్స్​ను మంత్రముగ్ధుల్ని చేశారామె. ఐష్ డ్యాన్సింగ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆమె అందానికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఆమె కళ్లకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఐష్ నీలి కళ్లను అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. నీలి కళ్లతో పాటు హెయిర్ కలర్ తనను అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెట్టాయని ఒక సందర్భంలో స్వయంగా ఐశ్వర్యనే చెప్పడం విశేషం.

ఐశ్వర్యారాయ్ కళ్ల గురించి బీజేపీ ఎమ్మెల్యే, మహారాష్ట్ర గిరిజన శాఖ మంత్రి విజయ్ కుమార్ గవిట్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నిత్యం చేపల్ని ఆహారంలో తీసుకుంటే ఐశ్వర్య కళ్లలా మిలమిలా మెరుస్తాయని విజయ్ కుమార్ అన్నారు. చేపలు తినడం వల్ల కళ్లు మెరవడంతో పాటు చర్మం మృదువుగా తయారవుతుందని చెప్పారు. ఒకప్పుడు ఐష్ మంగుళూరు సముద్రతీరంలో నివసించేవారని, నిత్యం చేపలు తినడం వల్లే ఆమె కళ్లు అందంగా మారాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఇలాంటి పనికిమాలిన కామెంట్స్ చేయకుండా గిరిజనుల సమస్యలపై మంత్రి దృష్టిపెడితే బాగుంటుందని ఎన్​సీపీ ఎమ్మెల్యే అమోల్ మిట్కారీ చెప్పారు.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommarsbahisMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/