iDreamPost
android-app
ios-app

సలార్ సక్సెస్ తో ప్రశాంత్ నీల్- Jr. NTR ప్రాజెక్ట్ వెనక్కి?

  • Published Dec 25, 2023 | 5:31 PM Updated Updated Dec 26, 2023 | 10:13 AM

Prashanth Neel Next Project: ప్రస్తుతం సలార్ తో పాన్ ఇండియా లెవల్లో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు ప్రశాంత్ నీల్. మరి ఇప్పుడు తన నెక్ట్ ప్రాజెక్ట్ ను ఎవరితో మొదలెట్టనున్నాడు అనే ఆసక్తి అంతటా నెలకొంది. అయితే, ఈ విషయమై అంచనాలు మారేలా ఉన్నాయనే వార్తలు నెట్టింట వినిపిస్తున్నాయి.

Prashanth Neel Next Project: ప్రస్తుతం సలార్ తో పాన్ ఇండియా లెవల్లో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు ప్రశాంత్ నీల్. మరి ఇప్పుడు తన నెక్ట్ ప్రాజెక్ట్ ను ఎవరితో మొదలెట్టనున్నాడు అనే ఆసక్తి అంతటా నెలకొంది. అయితే, ఈ విషయమై అంచనాలు మారేలా ఉన్నాయనే వార్తలు నెట్టింట వినిపిస్తున్నాయి.

  • Published Dec 25, 2023 | 5:31 PMUpdated Dec 26, 2023 | 10:13 AM
సలార్ సక్సెస్ తో ప్రశాంత్ నీల్- Jr. NTR ప్రాజెక్ట్ వెనక్కి?

కేజియఫ్1,2 సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో.. తన మార్క్ ను సెట్ చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక ఇప్పుడు ‘సలార్’ చిత్రంతో..భారీ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఎప్పటినుంచో తమ అభిమాన హీరో హిట్ కోసం.. ఎదురుచూస్తున్న వారందరికీ ఈ చిత్రంతో ఊరట కలిగించాడు. సరిగ్గా ప్రభాస్ కట్ అవుట్ ని తెర పైన ప్రేక్షకులు ఊహించని రేంజ్ లో దింపి.. ప్రభంజనం సృష్టించాడు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘సలార్’ సందడి వాతావరణమే కనిపిస్తుంది. డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం.. ఇప్పటివరకు భారీ కలెక్షన్లను తన ఖాతాలో వేసుకుంది. కాగా, దర్శకుడు ఈ చిత్రాన్ని రెండు పార్ట్స్ గా రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే సలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌ చూసిన ప్రేక్షకులు ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఏ చిత్రాన్ని టేక్ ఓవర్ చేయనున్నాడు అనే చర్చలు మొదలయ్యాయి.

ప్రశాంత్ నీల్ ఏం చేసినా అదొక అద్భుతంలా మారిపోతోంది. మాస్ సినిమాను సైతం క్లాస్ గా చూపించడంలో ఈ దర్శకుడి తర్వాతే ఎవరైనా. అప్పుడు కేజియఫ్, ఇప్పుడు సలార్.. తనదైన స్టైల్ లో కథను తెర పైన చూపించి ఆడియన్సు ను ఓ కొత్త ప్రపంచానికి తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఈ దర్శకుడి చేతికి చిక్కిన ఏ హీరో అయినా భారీ హిట్ ను వారి ఖాతాలో వేసుకోవడం కాయం. అయితే, ఇప్పటికే ‘సలార్’ పార్ట్-1 లో ఊహించని ట్విస్ట్ ఇచ్చి.. నెక్స్ట్ పార్ట్ మీద మరింత ఆసక్తిని నెలకొల్పాడు. సలార్ పార్ట్-2 ‘శౌర్యాంగ పర్వం’ అని కూడా రివీల్ చేశాడు. దీనితో ప్రశాంత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పైన అప్పుడే చర్చలు మొదలైపోయాయి. అయితే, సలార్ ప్రమోషన్స్ సమయంలోనే తన తర్వాత ప్రాజెక్ట్ గురించి బయటపెట్టాడు ప్రశాంత్. తన నెక్స్ట్ సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఉండబోతోంది అంటూ.. ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్‌తో ఇప్పటికే పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. ఈ చిత్రం 2024 ఏప్రిల్ లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపించాయి. అయితే, ఇప్పుడున్న పరిస్థితి చూస్తే అంతా తారుమారు అయ్యేలా ఉంది.

సలార్ పార్ట్-1 బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతున్న సమయంలో.. సలార్ పార్ట్-2 ‘శౌర్యాంగ పర్వం’ ఉంటుందని రివీల్ చేసినా.. ఆ చిత్రం ఎప్పుడు విడుదల చేస్తారు అని మాత్రం ప్రశాంత్ చెప్పలేదు. నిజానికి ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్-1 విడుదల తర్వాత ఎన్టీఆర్ తోనే వర్క్ చేయాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, అటు దేవర సినిమా కూడా రెండు పార్ట్స్ గా ఉండనుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ వార్2 చిత్రానికి కూడా డేట్స్ బ్లాక్ అయిపోయి ఉన్నాయి. దీనితో ఎన్టీఆర్ 31 సెట్స్ పైకి వెళ్ళడానికి ఆలస్యం అయ్యేలా ఉంది. మరి, ఈ రకంగా చూడబోతుంటే ప్రశాంత్ నీల్ సలార్ శౌర్యాంగ పర్వాన్ని.. ముందుగా ఫినిష్ చేసి ఆడియన్సు లో ఉన్న జోష్ ను తగ్గించకుండా, వెంటనే వారికి ఫుల్ మీల్స్ ను అందించేలా ఉన్నాడు.

ఎన్టీఆర్ తన చిత్రాలను పూర్తి చేసుకునే లోపు.. ప్రశాంత్ సలార్ సెకండ్ పార్ట్ ను పూర్తి చేసుకోనున్నాడు..అనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇలా కనుక చేస్తే ‘శౌర్యాంగ పర్వం’ షూటింగ్ పూర్తయ్యే సమయానికి ఎన్టీఆర్31 ను లాంచ్ చేసి.. సలార్-2 విడుదలైన తర్వాత ఎన్టీఆర్ తో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్లే అవకాశం ఉంది. గతంలోనూ కేజియఫ్-2 షూటింగ్ సమయంలోనే ‘సలార్’ ను అనౌన్స్ చేశాడు. ఇప్పుడు కూడా ప్రశాంత్ నీల్ అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడేమో మరి చూడాలి. కానీ, దీనికి సంబంధించి.. ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఏదేమైనా, సాలార్ పార్ట్-1 సీజ్‌ఫైర్‌ వేడి చల్లారకముందే పార్ట్-2 శౌర్యాంగ పర్వాన్ని కూడా జోడిస్తే.. అభిమానులను ఆపడం ఎవరి తరం కాదని చెప్పి తీరాలి. ఇక ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గా దేనిని అనౌన్స్ చేస్తాడో వేచి చూడాల్సి ఉంది. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişcasibom