iDreamPost
android-app
ios-app

క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి ముఖంలో ఆనందాన్ని నింపిన అడవిశేష్!

  • Published Jul 20, 2024 | 6:54 PM Updated Updated Jul 20, 2024 | 6:54 PM

Adivi Sesh.. హిట్ 2 మూవీ తర్వాత రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు అడివి శేష్. ఇంత బిజీ షెడ్యూల్లోనూ తన పెద్ద మనస్సును చాటుకున్నాడు. ఓ చిన్నారి ముఖంలో ఆనందం వెల్లువిరిసేలా చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.

Adivi Sesh.. హిట్ 2 మూవీ తర్వాత రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు అడివి శేష్. ఇంత బిజీ షెడ్యూల్లోనూ తన పెద్ద మనస్సును చాటుకున్నాడు. ఓ చిన్నారి ముఖంలో ఆనందం వెల్లువిరిసేలా చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.

  • Published Jul 20, 2024 | 6:54 PMUpdated Jul 20, 2024 | 6:54 PM
క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి ముఖంలో ఆనందాన్ని నింపిన అడవిశేష్!

టాలీవుడ్ మోస్ట్ టాలెంట్ యంగ్ హీరోల్లో ఒకరు అడివి శేష్. అమెరికా నుండి వచ్చి హీరో అయినప్పటికీ.. ఈ ప్రయాణంలో ఎన్నో స్ట్రగుల్స్ పడ్డాడు. చివరకు సక్సెస్ ఫుల్ యాక్టర్‌గా మారాడు. అతడు నాట్ ఓన్లీ హీరో.. డైరెక్టర్ అండ్ రైటర్ ఆల్సో. హిట్ సెకండ్ కేస్ తర్వాత రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు అడివి శేష్. సొంతం మూవీలో స్మాల్ రోల్ చేసి.. ఎనిమిదేళ్లు గ్యాప్ తీసుకుని కర్మ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత పంజా మూవీలో విలన్ పాత్రలో మెప్పించి.. మళ్లీ హీరోగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యాడు. రన్ రాజా రన్ అతడ్ని క్రేజీ నటుడిగా మార్చింది. అక్కడి నుండి హీరో వెను దిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇదిలా ఉంటే..  శేష్ మరోసారి తన గొప్ప మనసును చాటారు.

రీల్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా హీరోనే అని నిరూపించాడు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా  క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్ని పాపకు సర్ ప్రైజ్ చేయడంతో పాటు రోజంతా సమయాన్ని గడిపారు.  సన్నిహితుల ద్వారా తన అభిమాని గురించి తెలుసుకున్న అడవిశేష్.. ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించాడు. వీడియో కాల్ ద్వారా కనెక్ట్ అయ్యాడు. ఒక హోటల్‌లో ఫ్యామిలీ కోసం డే అవుట్ ని ప్లాన్ చేసి, అక్కడ చిన్నారిని కలసి సర్ప్రైజ్ చేశారు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.  పాప పేరు కీర్తి. ఆమెకు చిన్నప్పటి నుండి అడివి శేష్ అంటే ఇష్టం. అయితే ఆమె క్యాన్సర్ బారిన పడింది. తన అభిమాన హీరోని కలవాలనుకుంది.

ఈ విషయం శేష్ కు తెలిసి ఆమె పేరేంట్స్, పాపతో టచ్ లో ఉన్నాడు.  అవసరమైనప్పుడు తన సపోర్ట్ ఉంటుందని చెప్పాడు. అయితే, కన్సల్టేషన్ కోసం హైదరాబాద్‌కు వచ్చినప్పుడు వారిని మళ్లీ కలుసుకుని పాపకు సర్ ప్రైజ్ ఇచ్చాడు.  అడవి శేష్ రాగానే.. ఎంతో సంబరపడిపోయింది ఈ చిన్నారి. తర్వాత ఆమె ఫోటోలు చూసి మురిసిపోయాడు. ఆమెతో ముచ్చట్లు చెప్పాడు. ఆమెతో కలిసి ఆడాడు, పాడాడు. ఆమెకు ఇష్టమైన బొమ్మలతో ఆటలాడించాడు. ఆమెను ఎత్తుకుని ఆనందంలో ముంచెత్తేలా చేశాడు. అతడి రాకతో పాప తనకున్న రోగాన్ని కూడా మర్చిపోయి ఎంతో సంతోషంగా గడిపింది. అలాగే తల్లిదండ్రులతోనూ మాట్లాడాడు.  క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి ముఖంలో ఆనందం వెల్లువిరిసేలా చేశాడు. దీంతో అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. హీరోలో అతడో జెమ్ అంటూ కొనియాడుతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet