iDreamPost
android-app
ios-app

అడవి శేష్‌ మంచి మనసు.. క్యాన్సర్‌ బాధిత పిల్లలకోసం..

  • Published Nov 05, 2023 | 5:53 PM Updated Updated Nov 05, 2023 | 5:53 PM

ప్రస్తుతం ఆ సినిమా శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. 2018లో వచ్చిన గూఢాచారి సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. 2024లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం ఆ సినిమా శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. 2018లో వచ్చిన గూఢాచారి సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. 2024లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Published Nov 05, 2023 | 5:53 PMUpdated Nov 05, 2023 | 5:53 PM
అడవి శేష్‌ మంచి మనసు.. క్యాన్సర్‌ బాధిత పిల్లలకోసం..

టాలీవుడ్‌లో ఉన్న అతికొద్ది మంది మల్టీ టాలెంటెడ్‌ హీరోల్లో అడవి శేష్‌ ముందు వరుసలో ఉంటారు. నటుడిగా.. దర్శకుడిగా.. రచయితగా.. ఆయన తన సత్తా చాటుతున్నారు. సినిమాకు సినిమాకు మధ్య పాత్రలో వేరియేషన్స్‌ చూపిస్తూ తనకంటూ ఓ అభిమాన ఘనాన్ని సృష్టిం‍చుకుంటున్నారు. తెలుగులో క్రేజీ హీరోగా మారారు. ఆయన చివరగా హిట్‌ 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తర్వాత అడవి శేష్‌ గూఢాచారి 2 షూటింగ్‌లో బిజీ అయిపోయారు.

ప్రస్తుతం ఆ సినిమా శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. 2018లో వచ్చిన గూఢాచారి సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. 2024లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  నిత్యం షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండే అడవి శేష్‌ తాజాగా క్యాన్సర్‌ బారిన పడ్డ చిన్నారులను కలిశారు.  కొద్దిసేపు పిల్లలతో ఆడిపాడారు. పిల్లలతో పిల్లవాడిగా కలిసిపోయి సందడి చేశారు. తాజాగా జూడ్‌ అనే ఓ స్వచ్ఛంద సేవా సంస్థను శేష్‌ సందర్శించారు. ఆ సంస్థ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్నారు.

అక్కడి చిన్నారులతో కలిసి సరదాగా డ్యాన్స్‌ కూడా చేశాడు. అనంతరం పిల్లలకు కొన్ని బహుమతులు అందజేశారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. పిల్లలతో గడపడం తన జీవితంలో చాలా గొప్ప సందర్భమని పేర్కొన్నారు. ఆ పిల్లలు చాలా ధైర్యంగా ఉన్నారని, వారు క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్నారని తెలిపారు. వారు తనకు చాలా ఆశను కల్పించారన్నారు. ఈ అవకాశం కల్పించిన కమలేష్, లక్ష్మికి ధన్యవాదాలు తెలియజేశారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom