iDreamPost
android-app
ios-app

Adipurush OTT Release: OTTలోకి ఆదిపురుష్..రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

  • Author Soma Sekhar Updated - 11:35 PM, Thu - 2 November 23
  • Author Soma Sekhar Updated - 11:35 PM, Thu - 2 November 23
Adipurush OTT Release: OTTలోకి ఆదిపురుష్..రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

ఆదిపురుష్.. ఆదిపురుష్.. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటుగా యావత్ భారతదేశం ఈ పేరు మారుమోగిపోతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవెయిటెడ్ చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16న విడుదల కానుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయినట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా పలు రికార్డులు తిరగరాస్తోంది ఆదిపురుష్. అయితే తాజాగా ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? ఆదిపురుష్ OTT రిలీజ్ డేట్ కు సంబంధించిన న్యూస్.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కృతిసనన్ హీరోయిన్ గా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆదిపురుష్. రామాయాణం ఆధారంగా నిర్మించిన ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ రాముడిగా నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ కాలం పిల్లలతో పాటుగా ప్రతీ ఒక్కరికి ఈ సినిమా చూపించాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ప్రచార కార్యక్రమాల్ని భారీ ఎత్తున చేపట్టారు.

ఇక సినిమా ఇంకా రిలీజ్ కాకముందే ఆదిపురుష్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అన్న చర్చ మెుదలైంది. ఈ చర్చకు పుల్ స్టాప్ పెడుతూ.. సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో చెప్పారు. థియేటర్లలో విడుదల అయిన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుందని BA రాజు టీమ్ తమ ట్విట్టర్ ఖాతాద్వారా తెలిపింది. ఇక ఈ సినిమాను మేకర్స్ థియేటర్లలోనే చూసి అనుభూతి పొందాలని ప్రేక్షకులను కోరుతున్నారు. అందుకే సినిమా విడుదల అయిన రెండు నెలల తర్వాతనే ఆదిపురుష్ ను ఓటీటీలోకి రిలీజ్ చెయ్యాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్ బుకింగ్స్ ప్రభంజనం కొనసాగుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కు మరో రెండు రోజులు టైమ్ ఉండటంతో.. తొలిరోజే ఆదిపురుష్ మూవీకి భారీ ఓపెనింగ్స్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఓటీటీ పార్ట్ నర్ ఏ సంస్థకు దక్కిందో మాత్రం యూనిట్ కన్ఫమ్ చేయలేదు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio