iDreamPost
android-app
ios-app

Adipurush, Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్! ఆదిపురుష్ సినిమా..

  • Author Soma Sekhar Published - 06:52 PM, Tue - 13 June 23
  • Author Soma Sekhar Published - 06:52 PM, Tue - 13 June 23
Adipurush, Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్! ఆదిపురుష్ సినిమా..

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులతో పాటుగా దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సీతగా కృతి సనన్ నటిస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇక జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సుమారు 500 కోట్ల బడ్జెట్ తో రూపొందింది ఆదిపురుష్. దాంతో నిర్మాతలు టికెట్స్ రేట్స్ పెంపు గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సమావేశాలు జరిపారు. ఈ నేపథ్యంలో ఏపీలో టికెట్స్ రేట్స్ పెంపునకు అనుమతులు లభించగా.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా రేట్లు పెంచుతున్నట్లు జీవోను పాస్ చేసింది.

ఆదిపురుష్.. రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటించిన చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16న థియేటర్లలోకి రానుంది. బుధవారం నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అవుతాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ నిర్మాతలు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో టికెట్స్ రేట్లు పెంచాలని విన్నవించుకున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో టికెట్ పై రూ. 50 పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. అయితే రూ. 50 పెంచాలా? లేక రూ. 25 పెంచాలా? అని మరోసారి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక తెలంగాణ ప్రభుత్వం టికెట్ల రేట్ ను సింగిల్ స్క్రీన్స్ లో రూ. 50 పెంచుకోవడానికి అనుమతినిస్తూ.. జీవో జారీ చేసింది. సింగిల్ స్క్రీన్స్ లో ఉదయం 4 గంటలు నుంచి ప్రదర్శింపబడే ఆటలకు ఇది వర్తిస్తుంది. విడుదల తేదీ నుంచి 3రోజుల పాటు ఈ రేట్ల పెంపు అమలు అవుతుందని ఆ జీవోలో తెలిపింది. అయితే ఈ రేట్ల పెంపు మధ్య తరగతి ప్రేక్షకులపై భారాన్ని మోపుతుందని వాపోతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetorder girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş