iDreamPost
android-app
ios-app

ఆదిపురుష్ మేకర్స్ కీలక నిర్ణయం.. టికెట్ల రేట్లు భారీగా తగ్గింపు!

  • Author Soma Sekhar Published - 12:13 PM, Mon - 26 June 23
  • Author Soma Sekhar Published - 12:13 PM, Mon - 26 June 23
ఆదిపురుష్ మేకర్స్ కీలక నిర్ణయం.. టికెట్ల రేట్లు భారీగా తగ్గింపు!

ఆదిపురుష్.. ఆదిపురుష్.. గత కొన్ని రోజులుగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వినిపించిన పేరు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రఘురాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతనగా నటించిన భారీ మైథలాజికల్ మూవీ. ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ రావణాసురిడిగా నటించాడు. డైరెక్టర్ ఓం రౌత్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కానీ అనుకున్నంతగా ఈ మూవీ వసూళ్లు రాబట్టలేకపోయింది. దాంతో మూవీ మేకర్స్ అయిన టీ సిరీస్ నిర్మాత సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల రేట్లను భారీగా తగ్గించింది.

ఆదిపురుష్ సినిమా నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రోజురోజుకు కలెక్షన్స్ పడిపోతుండటంతో.. టికెట్ల రేట్లను తగ్గిస్తున్నట్లు ఆదిపురుష్ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ ప్రకటించింది. ఇక నుంచి ఈ సినిమాను 3Dలో కేవలం రూ.112 రూపాయలకే చూడవచ్చని పేర్కొంది. అదీకాక సినిమాలోని డైలాగ్స్ పై వచ్చిన విమర్శల నేపథ్యంలో వాటిని కూడా మార్చినట్లు టీ సిరీస్ వెల్లడించింది. మార్పులు చేసిన రేపటి నుంచి ప్రదర్శితం అవుతుందని మేకర్స్ తెలిపారు. కొన్ని రోజుల క్రితమే రూ. 150 రూపాయాలకు తగ్గించిన రేట్లను మరోసారి తగ్గించింది. దాంతో పేద, మధ్య తరగతి ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని చూస్తారని మేకర్స్ భావిస్తున్నారు.

అయితే మెుదటి మూడు రోజులు వరుసగా రూ. వంద కోట్లు కొల్లగొట్టిన డార్లింగ్.. ఆ తర్వాత ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాడు. దాంతో ఆదిపురుష్ నష్టాల్లో కూరుకుపోయే దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే మేకర్స్ నష్టాలను కొంతలో కొంతైనా పూడ్చుకోవడానికి టికెట్ల రేట్లను తగ్గించారు. ఇక రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ కు ఇది రెండో డిజాస్టర్ కావడంతో.. అభిమానులు సలార్ పైనే ఆశలు పెట్టుకున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet