iDreamPost
android-app
ios-app

Adipurush: ప్రభాస్ బాక్సాఫీస్ దండయాత్ర.. మూడో రోజూ దుమ్ములేపిన కలెక్షన్లు

  • Author Soma Sekhar Published - 06:00 PM, Mon - 19 June 23
  • Author Soma Sekhar Published - 06:00 PM, Mon - 19 June 23
Adipurush: ప్రభాస్ బాక్సాఫీస్ దండయాత్ర.. మూడో రోజూ దుమ్ములేపిన కలెక్షన్లు

ప్రభాస్ రఘురాముడిగా, కృతి సనన్ జానకీదేవిగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’ ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ రామాయాణం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కొన్ని వర్గాల ప్రేక్షకులు బాగుంది అంటే.. మరికొన్ని వర్గాల ప్రజలు బాలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ ప్రభాస్ ప్రభంజనం థియేటర్ల వద్ద కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో రోజు కూడా ఆదిపురుష్ వంద కోట్ల మార్క్ ను చేరుకుంది. మరి మూడో రోజు ఎంత కలెక్ట్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆదిపురుష్.. ఇండియాలో గత మూడు రోజులుగా వినిపిస్తున్న పేరు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి రాముడిగా నటించిన చిత్రం కావడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో మాత్రం డైరెక్టర్ విఫలం అయ్యాడనే చెప్పాలి. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ చిత్రం గ్రాఫిక్స్ లోనే ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అయినప్పటికీ వసూళ్లలో ఏ మాత్రం తగ్గలేదు. వరుసగా మూడో రోజు కూడా వంద కోట్ల మార్క్ ను చేరుకుని రికార్డు నెలకొల్పింది. ఇది కేవలం డార్లింగ్ ప్రభాస్ మేనియా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇక తొలి రోజు రూ. 140 కోట్లు కొల్లగొట్టిన ఆదిపురుస్.. రెండో రోజు రూ. 100 కోట్లు వసూల్ చేసింది. ఇక మూడోరోజు కూడా వంద కోట్ల మార్క్ ను చేరుకుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. దాంతో ఇప్పటి వరకు ఆదిపురుష్ మూడు రోజుల కలెక్షన్లు రూ. 340 కోట్లకు చేరుకున్నట్లు యూనిట్ పోస్టర్ ద్వారా తెలిపింది. అయితే ఈ మూడు రోజుల్లో శని, ఆది వారాలు ఉండటంతో ఈ రేంజ్ లో వసూళ్లు రాబట్టింది. కానీ అసలైన పరీక్ష ఇప్పుడే మెుదలు కానుంది. సోమవారం నుంచి వచ్చే కలెక్షన్లే మూవీ రిజల్ట్ ను నిర్దేశించనున్నాయి. మరి ఈ వీక్ డేస్ లో ప్రభాస్ మేనియా ఏ విధంగా పనిచేస్తుందో వేచిచూడాలి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetkom girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetstarzbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis