iDreamPost
android-app
ios-app

పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. హీరోయిన్ తాప్సీ షాకింగ్ కామెంట్స్!

  • Author ajaykrishna Published - 08:36 AM, Tue - 18 July 23
  • Author ajaykrishna Published - 08:36 AM, Tue - 18 July 23
పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. హీరోయిన్ తాప్సీ షాకింగ్ కామెంట్స్!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోయిన్స్ పెళ్లి విషయంలో భిన్నమైన సమాధానాలు చెబుతున్నారు. ఎందుకో తెలీదు.. దాదాపు పెళ్లి అనగానే హీరోయిన్స్ నోటి నుండి నెగిటివ్ అని కాదు.. కానీ నెగిటివ్ లాంటి ఆన్సర్స్ వస్తున్నాయి. అందులోనూ అసలు సంప్రదాయాలకు విలువ లేకుండా.. అసలు పెళ్లి విషయంలో మాది ఇండియన్ కల్చర్ కాదనే విధంగా మాట్లాడుతున్నారు. గతంలో 25 ఏళ్లు పైబడితే అమ్మాయిలకు పెళ్లి వయసు దాటిపోతోంది అనేవారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ అని.. 30, 35 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు చేసుకోవట్లేదు. పైగా పెళ్లి ఊసు వస్తే.. పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. పెళ్లి కాకుండానే పిల్లలు కావాలనే కామెంట్స్ చేస్తూ షాకులిస్తున్నారు. తాజాగా హీరోయిన్ తాప్సీ అలాంటి కామెంట్స్ చేసింది.

తాప్సీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సొట్టబుగ్గల బ్యూటీగా ఇక్కడ బాగా పాపులర్ అయ్యింది. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చాలా బిజీ అయిన తాప్సీ.. కొన్నాళ్ళ నుండి బాలీవుడ్ కే పరిమితమైంది. అక్కడే స్టార్డమ్ సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తోంది. డిఫరెంట్ క్యారెక్టర్స్ తో.. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ.. మంచి పేరు తెచ్చుకున్న తాప్సీ.. రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే అందుకుంటుందని తెలుస్తుంది. గత రెండేళ్లుగా తాప్సీకి సరైన బ్రేక్ రాలేదు. సో.. ప్రెజెంట్ బిగ్ బ్రేక్ కోసం ట్రై చేస్తోంది. సౌత్ లో అయితే.. ఎప్పుడో ఒకటి ఓకే చేస్తుంది అమ్మడు. అయితే.. సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే తాప్సీ.. రీసెంట్ గా ఫ్యాన్స్ తో ముచ్చటించింది.

ఈ చిట్ చాట్ లో తాప్సీకి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అనే ప్రశ్నకు.. తాప్సీ నుండి ఊహించని సమాధానం వచ్చింది. “నా పెళ్లి గురించి చాలామంది అడుగుతున్నారు. కానీ.. నాకింకా ప్రెగ్నెన్సీ రాలేదు. సో.. నేను ప్రెగ్నెంట్ కాదు కాబట్టి.. పెళ్లి ఇప్పట్లో కాకపోవచ్చు. ఒకవేళ అలా ఏమైనా జరిగితే చెప్తాను” అని షాకిచ్చింది. దీంతో ఖంగుతినడమే సమాధానం విన్నవారి వంతు అయ్యింది. తాప్సీ కావాలని అలా రిప్లై ఇచ్చిందా లేక ఎవరిమీదనైనా కౌంటర్ వేసిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం తాప్సీ వయసు 35 ఏళ్లు దాటింది. సరే కెరీర్ పరంగా సినిమాలు చేయడం ఓకే.. కానీ, ఇలా పెళ్లికి, ప్రెగ్నెన్సీకి ముడి వేయడమే బాలేదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి తాప్సీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet