iDreamPost
android-app
ios-app

ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్న నటి

  • Published Jan 17, 2024 | 8:39 PM Updated Updated Jan 19, 2024 | 12:56 PM

వెండితెర, బుల్లితెర ఇండస్ట్రీలో నటీనటులు తమ సహ నటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే.

వెండితెర, బుల్లితెర ఇండస్ట్రీలో నటీనటులు తమ సహ నటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే.

  • Published Jan 17, 2024 | 8:39 PMUpdated Jan 19, 2024 | 12:56 PM
ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్న నటి

ఈ మద్య కాలంలో వెండితెర, బుల్లితెరకు చెందిన నటీనటులు, దర్శక, నిర్మాతలు, ఇతర రంగాలకు చెందిన వారు వివాహబంధంతో ఒక్కటవుతున్నారు. ఇండస్ట్రీలో చాలా వరకు ప్రేమ వివాహాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తమ సహనటులతో కొంతకాలం ప్రేమాయణం కొనసాగించి.. పెద్దలను ఒప్పించి మూడు ముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. గత ఏడాది వరుసగా హీరోయిన్లు, హీరోలు పెళ్లిళ్లు చేసుకున్నారు. మాలీవుడ్ నుంచి ఎంతోమంది హీరోయిన్లు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ప్రముఖ నటి తాను ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..

మాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటి, యాంకర్ స్వసిక విజయ్ పెళ్లి చేసుకోబుతున్నట్లు ఇటీవల మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. తన సహ నటుడు ప్రేమ్ జాకోబ్ తో కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ అమ్మడు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై స్పందించిన స్వసిక విజయ్ స్పందిస్తూ.. తాము కొంత కాలంగా ప్రేమించుకుంటున్నామని.. ఈ నెలలోనే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు వెల్లడించింది. జాకోబ్ తో కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది. 2009 లో వాగై అనే మూవీలో నటించిన స్వసిక తర్వాత గోరిపాళయం అనే మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటించింది. 2020 లో జాకోబ్, స్వసిక కలిసి ‘మనంపోలే మాంగళ్యం’ అనే సీరియల్ లో నటించారు. అప్పటి నుంచే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు కథనాలు వచ్చాయి.

actress getting marriage

స్వసిక మొదట హీరోయిన్ గా నటించినప్పటికీ.. తర్వాత సెకండ్ హీరోయిన్, క్యారెక్టర్ పాత్రలు పోషించింది. తమిళ, మలయాళ బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించింది. అంతేకాదు పలు షోలకు హూస్ట్ గా వ్యవహరించారు. తెలుగు లో 2012లో ‘ఎటు చూసినా నువ్వు’ మూవీలో హిరోయిన్ గా నటించింది. ఈ మూవీతో తెలుగు లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తిరిగి మాలీవుడ్ కి వెళ్లిపోయింది. మనం పోల్ మాంగల్యం సీరియల్ తర్వాత ఈ జంటపై ఎన్నో కథనాలు వచ్చినప్పటికీ పెద్దగా రియాక్ట్ కాని స్వసిక తాజాగా తన పెళ్లి గురించి వార్తపై క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇండస్ట్రీలో మరో సెలబ్రెటీ లవర్స్ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతున్నారన్నమాట. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Swaswika (@swasikavj)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet