iDreamPost
android-app
ios-app

కూతురు కెరీర్ కోసం బిగ్ బాస్ లోకి ప్రముఖ నటి?

  • Author ajaykrishna Published - 02:28 PM, Thu - 10 August 23
  • Author ajaykrishna Published - 02:28 PM, Thu - 10 August 23
కూతురు కెరీర్ కోసం బిగ్ బాస్ లోకి ప్రముఖ నటి?

ఈ ఏడాది సెప్టెంబర్ లో తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సందడి మొదలు కాబోతుంది. ఇదివరకటిలా కాకుండా ఈసారి చాలా కొత్తగా ఉండబోతుంది అని హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రమోషన్స్ లో చెబుతూ వస్తున్నారు. ఇప్పటిదాకా ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్ బాస్.. 7వ సీజన్ తో అలరించడానికి రెడీ అయిపోయింది. ప్రస్తుతం బిగ్ బాస్ నిర్వాహకులు.. సరైన కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసే పనిలో ఉన్నారట. ప్రస్తుతానికి కొంతమంది సినీ, బుల్లితెర సెలబ్రిటీల పేర్లు కంటెస్టెంట్స్ గా రాబోతున్నారని గట్టిగా ప్రచారం అయితే జరుగుతుంది. ఈ క్రమంలో టాలీవుడ్ కి చెందిన ఓ సీనియర్ నటి.. తన కూతురు కెరీర్ కోసం బిగ్ బాస్ లో అడుగు పెట్టబోతుందని టాక్.

ఇంతకీ ఆ సీనియర్ నటి ఎవరు.. కూతురు కెరీర్ కోసం ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. డిఫరెంట్ రోల్స్ చేసి మెప్పించారు. ముఖ్యంగా డాక్టర్ గా.. అక్కగా.. వదినగా.. నర్స్ గా.. ఇప్పుడు మోడరన్ మదర్ గా వెరైటీ పాత్రలలో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. కొన్నాళ్ళుగా సినిమాలలో తక్కువగా కనిపిస్తున్న సురేఖా వాణి.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటున్నారు. ముఖ్యంగా తన కూతురు సుప్రితతో కలిసి గ్లామరస్ ఫోటోషూట్స్.. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ తన ఫాలోయర్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు.

ప్రస్తుతం సురేఖా వాణి తన కూతురు సుప్రితతో కలిసి విదేశీ టూర్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సురేఖాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. సురేఖా వాణి ఆల్రెడీ తన కూతురు సుప్రితను ఆడియన్స్ కి పరిచయం చేసి.. చాలా కాలం అవుతోంది. ఎలాగో తల్లికి తగ్గట్టు అందంగా ఉంది కాబట్టి.. సుప్రిత కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందేమో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ.. ఇప్పటిదాకా ఏ సినిమాలోను సుప్రిత నటించలేదు. త్వరలోనే హీరోయిన్ గా డెబ్యూ చేసే ఆలోచనలు ఉన్నాయట. ఇలాంటి టైమ్ లో ఆడియన్స్ కి మరింత దగ్గర అవ్వడానికి సురేఖావాణి.. తన కూతురు సుప్రితతో కలిసి బిగ్ బాస్ లో అడుగుపెట్టనుందని ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంత నిజముందో గానీ.. ఒకవేళ నిజంగా ఈ మోడరన్ తల్లీకూతుళ్లు బిగ్ బాస్ లో అడుగుపెడితే.. తర్వాత ఫ్యాన్స్ కి ఊహించని విధంగా వినోదం లభిస్తుందని టాక్. చూడాలి ఏం జరగనుందో! మరి సురేఖా వాణి, సుప్రిత బిగ్ బాస్ లోకి వస్తే బాగుంటుందా లేదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss