iDreamPost
android-app
ios-app

విమానంలో ఆకతాయికి బుద్ది చెప్పిన తెలుగు నటి! పోస్ట్ వైరల్!

  • Author ajaykrishna Published - 04:16 PM, Wed - 26 July 23
  • Author ajaykrishna Published - 04:16 PM, Wed - 26 July 23
విమానంలో ఆకతాయికి బుద్ది చెప్పిన తెలుగు నటి! పోస్ట్ వైరల్!

సినీ సెలబ్రిటీలకు అప్పుడప్పుడు కామన్ పీపుల్ తో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. తెలిసి కావచ్చు లేదా తెలియక కావచ్చు.. కానీ, ఏదొక విధంగా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్, లేడీ ఆర్టిస్ట్ లు ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు.. బాగా రద్దీగా ఉన్న ఏరియాలకు వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ తో ఇబ్బంది పడుతుంటారు. కానీ.. విమాన ప్రయాణంలో కూడా ఇబ్బందులు తప్పట్లేదని అంటోంది తెలుగు నటి శ్రీసుధ. పలు సూపర్ హిట్ సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన శ్రీసుధ.. రీసెంట్ గా ఫ్లైట్ జర్నీలో ఓ ఆకతాయి వల్ల ఇబ్బంది పడ్డానని చెప్పింది. అంతేగాక అతనికి తగిన బుద్ది కూడా చెప్పానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

అసలేం జరిగింది అనే వివరాల్లోకి వెళ్తే.. శ్రీసుధ విమానంలో జర్నీ చేస్తుండగా.. ఆమె వెనుక సీట్ లో కూర్చున్న వ్యక్తి.. కాళ్ళు ముందుకు పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడట. పలుమార్లు చెప్పి చూసినా వినకుండా కాళ్ళను.. శ్రీసుధ కాళ్ళకు తగిలిస్తూ ముందుకు పెట్టాడట. ఇంకేముంది ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదని ముందుగా హెచ్చరించి.. తర్వాత అతనికి తగిన శాస్తి చేసిందట. అతని ప్రవర్తన గురించి విమాన సిబ్బందికి కంప్లైంట్ ఇచ్చినా మారలేదట. దీంతో అతని కాళ్ళపై గట్టిగా కొట్టిందట. అతని ఎముకలు విరిగి ఉంటే తనకు సంబంధం లేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది అమ్మడు. సదరు వ్యక్తి కాళ్ళను ముందుకు పెట్టిన పిక్ కూడా షేర్ చేసింది శ్రీ సుధా.

ప్రస్తుతం శ్రీసుధ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆమె చేసిన పనికి కొందరు నెటిజన్స్ సపోర్ట్ చేస్తున్నారు. మంచి పని చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు కొట్టకుండా కంప్లైంట్ ఇవ్వాల్సింది అన్నారు.. వారికి సమాధానంగా.. ‘అది నాకు కూడా తెలుసు. ముందు చాలాసార్లు చెప్పి చూసాను. కానీ.. అతని ప్రవర్తన మారలేదు. సో.. అంతలా విసిగిస్తే ఏం చేయాలి కొట్టేసాను’ అని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. శ్రీసుధ తెలుగులో చాలామంది స్టార్ హీరోల సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో మెరిసింది. ముఖ్యంగా ఆమెకు అర్జున్ రెడ్డి సినిమాతో మంచి గుర్తింపు వచ్చిందని గతంలో చెప్పింది. మరి ఫ్లైట్ జర్నీలో శ్రీసుధ చేసిన పని గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Sri Sudha Bhimireddy (@srisudha_bhimireddy)