మలయాళ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ పై నటి లైOగిక ఆరోపణలు

Star Actress Allegations On Star Director: స్టార్ దర్శకుడు సినిమాలో అవకాశం పేరుతో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఓ నటి ఆరోపణలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జస్టిస్ హేమ కమిటీ నివేదిక తర్వాత పలువురు నటీమణులు తమకు ఎదురైన సమస్యల గురించి బయటపెడుతున్నారు.

Star Actress Allegations On Star Director: స్టార్ దర్శకుడు సినిమాలో అవకాశం పేరుతో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఓ నటి ఆరోపణలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జస్టిస్ హేమ కమిటీ నివేదిక తర్వాత పలువురు నటీమణులు తమకు ఎదురైన సమస్యల గురించి బయటపెడుతున్నారు.

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళా ఆర్టిస్టులు ఫేస్ చేస్తున్న లైంగిక సమస్యలపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నివేదికపై హీరో నాని కూడా స్పందించారు. దేశమంతటా చర్చ నడుస్తున్న క్రమంలో ఒక్కొక్కరుగా బయటకు వచ్చి గతంలో తమకు ఎదురైన సమస్యలను బయటపెడుతున్నారు. తాజాగా ఓ నటి ప్రముఖ దర్శకుడిపై ఆరోపణలు చేసింది. మలయాళ సినీ పరిశ్రమకు  చెందిన స్టార్ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ పై బెంగాలీ నటి శ్రీలేఖ పలు ఆరోపణలు చేశారు. 2009లో ఓ సినిమా ఆడిషన్ కోసం తనను హోటల్ రూమ్ కి పిలిచారని.. ఆ సమయంలో ఆ దర్శకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొంది.  

పలేరి మాణిక్యం సినిమా ఆడిషన్స్ కోసం వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డానని.. ఆడిషన్స్ కోసం అని దర్శకుడ్ని కలిశానని ఆమె చెప్పుకొచ్చింది. అదే సమయంలో సినిమాటోగ్రాఫర్ తో ఫోన్ లో మాట్లాడుతున్న సమయంలో రంజిత్ బాలకృష్ణన్ తన చేతి గాజులని తాకారని.. ఆ తర్వాత మెడపై చేయి వేశారని ఆమె ఆరోపించింది. ఇబ్బందిగా అనిపించి అక్కడ ఉండలేక వెంటనే హోటల్ రూమ్ నుంచి బయటకు వెళ్లిపోయానని ఆమె వెల్లడించింది. ఆ సమయంలో తన బాధను ఎవరితోనూ చెప్పలేకపోయానని.. రాత్రి మొత్తం హోటల్ రూమ్ లోనే భయపడుతూ గడిపానని ఆమె గుర్తుచేసుకుంది. త్వరగా తెల్లారితే బాగుండునని అనుకున్నానని.. తలుపు కొడతారేమో అని అనుక్షణం భయపడేదన్నానని ఆమె చెప్పుకొచ్చింది. ఈ సంఘటన తర్వాత తనకు తిరిగి ఇంటికి వెళ్ళడానికి రిటర్న్ టికెట్లు కూడా ఇవ్వలేదని తెలిపింది. ఈ సంఘటనతో మలయాళీ ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా అని శ్రీలేఖ మిత్రా ఆరోపించింది.

ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ వ్యాఖ్యలపై దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ స్పందించారు. ఆమె చేసినవి కేవలం ఆరోపణలే అని అన్నారు. ఆమెకు తన సినిమాలో ఛాన్స్ ఇవ్వలేదని ఇలా తన మీద ఆరోపణలు చేస్తుందని అన్నారు. ఇక ఈ వ్యవహారంపై కేరళ మంత్రి సాజీ చెరియన్ మాట్లాడుతూ.. శ్రీలేఖ మిత్ర బహిరంగంగా ఆరోపణలు చేశారు.. డైరెక్టర్ రంజిత్ ఆ ఆరోపణలు ఖండించారు. ఈ వ్యవహారంపై శ్రీలేఖ ఫిర్యాదు చేసి ఉంటే దర్యాప్తు చేయచ్చు. విచారణ లేకుండా ఆమె చేసిన ఆరోపణలు నిజం అని భావించలేం’ అని అన్నారు. ఇక రంజిత్ బాలకృష్ణన్ రావణ ప్రభు, నందనం, ప్రజాపతి, బ్లాక్, కేరళ కేఫ్, ఇండియన్ రూపీ వంటి సినిమాలని తెరకెక్కించారు. ఇండియన్ రూపీ సినిమాకి ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గా జాతీయ అవార్డు దక్కింది.

Show comments