iDreamPost
android-app
ios-app

మీరు మద్యం తాగుతారా? నెటిజన్ ప్రశ్నకు శృతిహాసన్ సూపర్ ఆన్సర్..

  • Author Soma Sekhar Published - 03:41 PM, Fri - 23 June 23
  • Author Soma Sekhar Published - 03:41 PM, Fri - 23 June 23
మీరు మద్యం తాగుతారా? నెటిజన్ ప్రశ్నకు శృతిహాసన్ సూపర్ ఆన్సర్..

సినిమా ఇండస్ట్రీలో నటీ, నటులపై వివిధ రకాల గాసిప్స్ వస్తుంటాయి. ఇందులో డేటింగ్, పెళ్లి, ప్రేమ గాసిప్సే ఎక్కువగా ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇక కొన్ని కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలకు విచిత్రమైన క్వశ్చన్స్ ఎదురౌతుంటాయి. అలాంటి విచిత్రమైన ప్రశ్నలకు కొంత మంది సెలబ్రిటీలు అంతే విచిత్రంగా సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా హీరోయిన్ శృతిహాసన్ కు ఓ నెటిజన్ నుంచి వింతైన ప్రశ్న ఎదురైంది. మీరు మద్యం తాగుతారా? అంటూ సదరు నెటిజన్ ప్రశ్నించగా.. అంతే హుందాగా ఆమె బదులిచ్చింది.

శృతిహాసన్.. విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. బాలీవుడ్, టాలీవుడ్ తో పాటుగా తమిళంలో కూడా సినిమాలు చేస్తూ.. మంచి నటిగా పేరు సంపాదించుకుంది. ఇక తన బాయ్ ఫ్రెండ్ తో దిగే రొమాంటిక్ పిక్స్ ను, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ట్రెండింగ్ లో ఉంటుంది. ఇక తరచుగా సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటిస్తుంటుంది ఈ బ్యూటీ.

కాగా.. ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ లో తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ సందర్భంగా ఓ అభిమాని నుంచి వింతైన ప్రశ్న శృతిహాసన్ కు ఎదురైంది. ఒక నెటిజన్ మీరు మద్యం తాగుతారా? అని ప్రశ్నించాడు. దానికి శృతి హుందాగా సమాధానం ఇచ్చింది. నేను మద్యం తాగను, డ్రగ్స్ తీసుకోను అంటూ బదులిచ్చింది. ఇక ప్రస్తుతం శృతి.. ప్రభాస్ సలార్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtarafbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis