ఇండస్ట్రీలో నటులుగా ప్రవేశించి సెలబ్రిటీ హోదా సంపాదించుకున్న నటినటులు.. కొన్నాళ్ళకు సినిమాల నుండి తప్పుకున్నాక ఎక్కడో చోట సెటిల్ అవుతుంటారు. అలా నటనకు దూరం అయ్యాక సీనియర్ నటి, భరత నాట్యం డ్యాన్సర్ శోభన తన తల్లితో కలిసి చెన్నైలో ఉంటుంది. నటిగా శోభన గురించి సౌత్ ఇండియన్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. సౌత్ లోని అన్ని భాషలలో ఆమె హీరోయిన్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది. ఆఖరికి పెళ్లి కూడా చేసుకోకుండా సింగల్ గా ఉంటూ.. విద్యార్థులలు క్లాసికల్ డాన్స్ నేర్పిస్తూ లైఫ్ లీడ్ చేస్తోంది. కాగా.. ఇటీవల శోభన ఇంట్లో నగదు చోరీ జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆమె పేరు మరోసారి వార్తల్లో హైలైట్ అయింది.
ఇక అసలు వివరాల్లోకి వెళ్తే.. శోభన చెన్నైలోని తేనాంపేట పరిధిలోని శ్రీమాన్ శ్రీనివాస కాలనీలో తన తల్లితో కలిసి నివాసం ఉంటోంది. రెండు అంతస్తులు కలిగిన బిల్డింగ్ లో పైన పోర్షన్ లో శోభన ఉంటూ.. కింది పోర్షన్ లో డాన్స్ స్కూల్ నిర్వహిస్తుంది. అయితే.. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిని చూసుకోడానికి.. కడలూరు జిల్లా, కొట్టుమన్నార్ కోవిల్ కు నుండి విజయ అనే మహిళను పనిలో పెట్టుకుంది శోభన. ఈ క్రమంలో కొద్దిరోజులుగా తన తల్లి డబ్బులు చోరీ జరుగుతున్నాయట. ఈ విషయాన్నీ తెలుసుకున్న శోభన.. ఇంట్లోకి ఎవరు రారు.. వస్తే పనిమనిషి విజయ తప్ప అని గుర్తించి.. ఆమెను నిలదీసింది. విజయ తనకు ఏం తెలియదని చెప్పేసరికి స్థానిక తేనంపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది శోభన.
అనంతరం.. పోలీసులు పనిమనిషి విజయను అదుపులోకి తీసుకుని విచారించారు. గత మార్చి నెల నుండి సుమారు రూ. 41 వేలు చోరీ చేసినట్లు విజయ ఒప్పుకుంది. ఆ డబ్బు కూడా కారు డ్రైవర్ ద్వారా తన కూతురుకు గూగుల్ పే చేసినట్లు తెలిపింది. అయితే.. దొంగతనం చేసానని ఒప్పుకున్న తర్వాత విజయ.. తనను పనిలో నుండి తీసేయవద్దని శోభనను కోరింది. దీంతో పోలీసులు మధ్యలో మాట్లాడి.. మరోసారి ఇలాంటి పని చేయొద్దని వార్నింగ్ ఇచ్చారట. అలాగే పనిలో నుండి తీసేయకుండా ఆమె జీతంలో నుండి రూ. 41 వేలు కట్ చేయమని శోభనకు సూచించారని సమాచారం. ఆ తర్వాత డబ్బు అవసరం అయితే తనను అడగాలని విజయకు చెప్పిందట శోభన. దీంతో దొంగతనం చేసినా.. పనిమనిషిని పనిలో నుండి తీయనందుకు ఫ్యాన్స్ ఆమెను అభినందిస్తున్నారు. మరి శోభన చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.