iDreamPost
android-app
ios-app

మ్యారేజ్ లైఫ్ ని వదిలేద్దామనుకున్నా! పెళ్లిపై నటి సంగీత షాకింగ్ కామెంట్స్..

  • Author Soma Sekhar Published - 05:33 PM, Thu - 13 July 23
  • Author Soma Sekhar Published - 05:33 PM, Thu - 13 July 23
మ్యారేజ్ లైఫ్ ని వదిలేద్దామనుకున్నా! పెళ్లిపై నటి సంగీత షాకింగ్ కామెంట్స్..

సెలబ్రిటీల జీవితాలు పైకి కనిపించినంత సంతోషంగా.. ఏమీ ఉండవు. వారికీ పర్సనల్ లైఫ్ లో ఎన్నో సమస్యలు, ఒత్తిడులు ఉంటూనే ఉంటాయి. ఏదో ఒక సందర్భంలో తమ సమస్యలను బయట ప్రపంచానికి చెబుతూ ఉంటారు. తాజాగా ప్రముఖ నటి సంగీత తన పెళ్లి జీవితంపై పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. మ్యారేజ్ లైఫ్ ను వదిలేద్దామనుకున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన వివాహ జీవితం చాలా దారుణంగా సాగిందని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. పలు ఆసక్తికర విషయాలను ఈ ఇంటర్వ్యూలో పంచుకుంది సంగీత.

నటి సంగీత.. టాలీవుడ్ లో హీరోయిన్ గా సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక శివపుత్రుడు సినిమాలో సంగీత చేసిన క్యారెక్టర్ కు అందరు ఫిదా కావాల్సిందే. ఇక ఖడ్గం సినిమాతో సంగీత క్రేజ్ మరో రేంజ్ కు వెళ్లింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో.. ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. ఇక హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్ ను కొనసాగిస్తోంది. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మ్యారేజ్ లైఫ్ గురించి పలు షాకింగ్ విషయాలను వెల్లడించింది. పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకు ఆ బంధం నుంచి బయటపడాలని అనుకుందట సంగీత.

ఈ క్రమంలోనే 2009లో తమిళ నటుడు, సింగర్ క్రిష్ ను సంగీత పెళ్లి చేసుకుంది. వీరిది ప్రేమ పెళ్లి కావడంతో.. ఇరు కుటుంబాల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురైందని, ఆ సమయంలో కుటుంబం చాలా దూరం కావడంతో.. అనవసరంగా పెళ్లి చేసుకున్నాను అన్న భావన కలిగిందని సంగీత చెప్పుకొచ్చింది. దాంతో ఈ మ్యారేజ్ లైఫ్ వదిలేద్దామని అనుకున్నట్లు సంగీత పేర్కొంది. అయితే ఈ విషయం ఎన్నో సార్లు తన భర్తకు చెప్పినట్లు తెలిపారు. దాంతో తన భర్త మోటివేషన్ కారణంగానే నేను.. ఆయన ఒకరినొకరు అర్ధం చేసుకున్నామని తెలిపింది. దాంతో మా మధ్య ఎన్ని గొడవలు వచ్చినాగానీ ఇద్దరం ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించుకునే వారిమని సంగీత చెప్పుకొచ్చింది. మరి ఒకానొక సందర్భంలో మ్యారేజ్ లైఫ్ ను వదిలేద్దామనుకున్న సంగీత వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఈ చిన్నారిని గుర్తుపట్టారా? స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు ప్రొడ్యూసర్ కూడా..!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom