iDreamPost
android-app
ios-app

నాతో అమర్యాదగా ప్రవర్తించారు.. కనీసం ఫోన్ కాల్స్‌కి రిప్లై లేదు: సంగీత

  • Published Aug 20, 2024 | 2:52 PM Updated Updated Aug 20, 2024 | 2:52 PM

Sangeetha Comments: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా మెరిసిన వారు.. సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి, అత్త ఇతర గౌరవమైన పాత్రల్లో నటిస్తున్నారు. కొంతమంది హీరోయిన్లు బుల్లితెరపై వచ్చే రియాల్టీ షోస్ లో జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.

Sangeetha Comments: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా మెరిసిన వారు.. సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి, అత్త ఇతర గౌరవమైన పాత్రల్లో నటిస్తున్నారు. కొంతమంది హీరోయిన్లు బుల్లితెరపై వచ్చే రియాల్టీ షోస్ లో జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.

  • Published Aug 20, 2024 | 2:52 PMUpdated Aug 20, 2024 | 2:52 PM
నాతో అమర్యాదగా ప్రవర్తించారు.. కనీసం ఫోన్ కాల్స్‌కి రిప్లై లేదు: సంగీత

తెలుగు ఇండస్ట్రీలో కృష్ణవంశి దర్శకత్వంలో మాస్ మహరాజ రవితేజ, శ్రీకాంత్ నటించిన ‘ఖడ్గం’ మూవీలో సినిమా నటి కావాలన్న ఆశతో పల్లెటూరు నుంచి నగలు పెట్టుకొని తన తల్లిదో సిటీకి వచ్చి ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేనేంటో చూపిస్తా అంటూ అమాయకంగా కనిపించే పాత్రలో నటి సంగీత అద్భుతంగా నటించారు. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన సంగీత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుంది. హీరోయిన్ గా మాంచి ఫామ్ లో ఉండగానే ప్రముఖ సింగర్ క్రిష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కూతురు ఉంది. ప్రస్తుతం పలు టీవీ షాల్లో జడ్జీగా వ్యవహరిస్తుంది. తాజాగా కోలీవుడ్ పై తన అభిప్రాయాన్ని కాస్త ఘాటుగా వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో పలు హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న సంగీత తర్వాత తల్లి, వొదిన, అక్క పాత్రల్లో నటిస్తూ వచ్చింది. తెలుగు బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు తమిళ చిత్రాల కన్నా తెలుగు చిత్రాల్లో నటించడమే ఇష్టం అని చెప్పింది. తమిళంలో కన్నా తెలుగులో మంచి గౌరవం లభిస్తుందని తెలిపింది. ఈ విషయంలో తనపై తమిళ అభిమానులు ఆగ్రహించినా..నేను నిజమే చెబుతున్నా. కోలీవుడ్ లో నాకు పలుమార్లు అవమానం జరిగింది.. ఇది అప్పట్లో బయటకు చెప్పుకోలేకపోయాను అని తెలిపింది.

వాస్తవానికి తమిళంలో తాను ఎవరినీ అవకాశాలు ఇమ్మని ప్రాధేయపడలేదని, తెలుగులో తనకు మంచి ఆధరణ లభిస్తుందని చెప్పారు. మంచి పారితోషికం, అవకాశాలు వస్తున్నప్పడు ఇక్కడే కెరీర్ కొనసాగించాలని ఆశపడ్డానని తెలిపింది.  తమిళ  ఇండస్ట్రీలో కొందరు అవకాశాల కోసం ఫోన్ చేసినా.. వారితో అమర్యాగా, అవమానకరంగా మట్లాడుతారు. వారే తమకు జీవితాన్ని ఇచ్చినంతగా బిల్డప్ ఇస్తారు. తన పారితోషికం ఎంతో కూడా వారే నిర్ణయిస్తారు. అలా కొన్నిసార్లు నాతో అమర్యాదగా మాట్లాడారు.. దీంతో నేను అటువైను వెళ్లడం మానేశాను. నిజం చెప్పాలంటే తమిళంలో మర్యాద లేదు.. అందుకే ఆ ఇండస్ట్రీలో ఎక్కువగా నటించలేదు అని అన్నారు సంగీత. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş