iDreamPost
android-app
ios-app

Samyuktha Hegde: కొత్త ఇళ్లు కొన్న హీరోయిన్‌.. వైరల్‌గా గృహ ప్రవేశం ఫొటోలు!

  • Published Jan 18, 2024 | 3:30 PM Updated Updated Jan 18, 2024 | 3:30 PM

సంయుక్త హెగ్డే తెలుగులో కేవలం ఒక సినిమా మాత్రమే చేశారు. తర్వాత ఆమెకు ఇక్కడ అవకాశాలు రాలేదు. దీంతో తమిళం, కన్నడ చిత్ర పరిశ్రమకు పరిమితం అయ్యారు.

సంయుక్త హెగ్డే తెలుగులో కేవలం ఒక సినిమా మాత్రమే చేశారు. తర్వాత ఆమెకు ఇక్కడ అవకాశాలు రాలేదు. దీంతో తమిళం, కన్నడ చిత్ర పరిశ్రమకు పరిమితం అయ్యారు.

  • Published Jan 18, 2024 | 3:30 PMUpdated Jan 18, 2024 | 3:30 PM
Samyuktha Hegde: కొత్త ఇళ్లు కొన్న హీరోయిన్‌.. వైరల్‌గా గృహ ప్రవేశం ఫొటోలు!

సంయుక్త హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. ఎందుకంటే ఆమె తెలుగులో కేవలం ఒక సినిమాలో మాత్రమే నటించారు. అది కూడా కన్నడలో సూపర్‌ హిట్‌ అయిన కిరిక్‌ పార్టీ మూవీ తెలుగు రీమేక్‌లో.. 2016లో ఆమె ‘కిరిక్‌ పార్టీ’ అనే కన్నడ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. రిషబ్‌ శెట్టి దర్శకత్వంలో.. రక్షిత్‌ శెట్టి హీరోగా చేసిన ఈ మూవీలో సెకండ్‌ హీరోయిన్‌ పాత్ర చేశారు. 2018లో తెలుగు ఎంట్రీ ఇచ్చారు. అయితే, తెలుగులో సరైన అవకాశాలు రాలేదు.

దీంతో కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితం అయ్యారు. 2019లో వచ్చిన వాచ్‌మ్యాన్‌ అనే సినిమాతో తమిళ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం తమిళం, కన్నడ భాషల్లో మాత్రమే సినిమాలు చేస్తున్నారు. ఆమె చివరగా ‘తూర్ధు నిగమన’ అనే కన్నడ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న క్రీమ్‌ సినిమా శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇక, అసలు విషయానికి వస్తే.. సంయుక్త తాజాగా ఓ ఇంటిని కొన్నారు. గృహ ప్రవేశం కూడా చేశారు.

new house bought by heroine

ఈ మేరకు సంయుక్త తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ‘‘ కొత్త ప్రారంభాలు.. కొత్త ఇంటి తలుపులు తెరిచాము. ఓ చిన్న వన్‌బీహెచ్‌కే ఇంటిలో.. అది కూడా అద్దె ఇంట్లో నలుగురం కలిగి ఉన్నాము. అప్పటి నుంచే కలలు కంటూ ఉన్నాను. ఏదో మా కంటూ ఓ సొంత ఇళ్లు ఉండాలని. ప్రతీ కన్నీటి బొట్టు.. ఈ యూనివర్స్‌కు కృతజ్ఞతలు.. అందమైన క్షణాన్ని ఆవిష్కరించినందుకు. మా కంటూ చెప్పుకోవటానికి ఓ సొంత ఇళ్లు ఉంది. ఈ యూనివర్స్‌కు కృతజ్ఞతలు.. ఓం నమశ్సివాయ ’’ అని పేర్కొన్నారు.

కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేసిన తాలూకా ఫొటోలను తన ఖాతాలో షేర్‌ చేశారు. ఆ ఫొటోలు కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటోలపై స్పందిస్తున్న నెటిజన్లు… ‘‘ శుభాకాంక్షలు.. మీరు ఇలాంటివి ఎన్నో సాధించాలి’’.. ‘‘శుభాకాంక్షలు సంయుక్త.. మీరు మీ నాన్న ఎంతో మంచి వారని విన్నాను’’.. ‘‘ మీ ఇళ్లు సుఖ శాంతులతో వర్థిల్లాలని కోరుకుంటున్నాను’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సంయుక్త ఇన్‌స్టా పోస్టుపై స్పందించిన వారిలో సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. మరి, హీరోయిన్‌ సంయుక్త హెగ్డే కొత్త ఇంటిని కొనటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde)

Jojobet GirişHoliganbetJojobetholiganbetHoliganbetjojobetHoliganbetjojobetcratosroyalbetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetsmove girişEscortes BelgiqueHoliganbetGrandpashabetHoliganbetCasibom GirişCasibom