iDreamPost
android-app
ios-app

Sai Pallavi: అలాంటి పాత్రలో నటించాలనుంది.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Published Jul 10, 2024 | 3:30 PM Updated Updated Jul 10, 2024 | 3:30 PM

తన దగ్గరికి వచ్చిన కథలను కాకుండా.. తనకు నచ్చిన కథలనే ఒప్పుకొంటూ.. సెలెక్టీవ్ గా మూవీస్ చేసుకుంటూ వెళ్తోంది సాయి పల్లవి. అయితే తనకు అలాంటి పాత్రలో నటించాలనున్నట్లు చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ ఆ పాత్ర ఏంటంటే?

తన దగ్గరికి వచ్చిన కథలను కాకుండా.. తనకు నచ్చిన కథలనే ఒప్పుకొంటూ.. సెలెక్టీవ్ గా మూవీస్ చేసుకుంటూ వెళ్తోంది సాయి పల్లవి. అయితే తనకు అలాంటి పాత్రలో నటించాలనున్నట్లు చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ ఆ పాత్ర ఏంటంటే?

  • Published Jul 10, 2024 | 3:30 PMUpdated Jul 10, 2024 | 3:30 PM
Sai Pallavi: అలాంటి పాత్రలో నటించాలనుంది.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు!

నటీ, నటులు తమ సినీ కెరీర్ లో ఎన్నో పాత్రల్లో నటిస్తూ ఉంటారు. అయితే.. వారికంటూ ఓ కోరిక ఉంటుంది. పలానా పాత్రలో నటించాలనుందని మనసులో మాటను సందర్భం వచ్చినప్పుడు బయటపెడుతూ ఉంటారు. తాజాగా తనకూ అలాంటి పాత్రలో నటించాలనుందని చెప్పుకొచ్చింది యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి. తన నటనతో, డ్యాన్స్ తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెదిరిపోని స్థానాన్ని సంపాదించుకుంది ఈ బ్యూటీ. మరి సాయి పల్లవి నటించాలనుకున్న ఆ పాత్ర ఏంటో తెలుసా? పదండి తెలుసుకుందాం.

సాయి పల్లవి.. టాలీవుడ్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్న ముద్దుగుమ్మ. అందానికి తగ్గ అభినయంతో పాటుగా నెమలిలా నాట్యం చేయడం సాయి పల్లవికి వెన్నతో పెట్టిన విద్య. అదీకాకుండా.. వరుసగా అవకాశాలు వస్తున్నాయి కదా అని.. ఏ మూవీ పడితే ఆ మూవీ చేయదు ఈ చిన్నది. పాత్ర నచ్చితేనే ఆ సినిమాలో నటించేందుకు అంగీకరిస్తూ.. ఇండస్ట్రీలో ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకెళ్తోంది. ఇక ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసిన ఈ బ్యూటీ.. పలానా పాత్రలో నటించాలనుందని వెల్లడించింది.

Sai Pallavi

తన దగ్గరికి వచ్చిన కథలను కాకుండా.. తనకు నచ్చిన కథలనే ఒప్పుకొంటూ.. సెలెక్టీవ్ గా మూవీస్ చేసుకుంటూ వెళ్తోంది సాయి పల్లవి. అలాంటి బ్యూటీకి ఓ క్యారెక్టర్ చేయాలనుందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. కామెడీ ప్రధానంగా సాగే పాత్రలో నటించాలనుందని చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు ఎన్నో క్యారెక్టర్లు చేసినా.. కామెడీ పాత్ర మాత్రం చేయలేదు. దాంతో ఆ రోల్ లో నటించాలనున్నట్లు తెలిపింది. ఇక ప్రస్తుతం సాయి పల్లవి చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. నాగచైతన్య సరసన ‘తండేల్’, హిందీలో తెరకెక్కుతున్న రామాయణంలో నటిస్తోంది. అలాగే శివకార్తికేయన్ హీరోగా ‘అమరన్’ మూవీలో కూడా ఛాన్స్ కొట్టేసింది. మరి కామెడీ పాత్ర చేయాలనుందన్న సాయి పల్లవి చిలిపి కోరికపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş