P Krishna
Actress Rohini Sensational Comments: వెండితెరపై ఒక్కసారైనా కనిపించాలని ఎంతోమంది కలలు కంటుంటారు. తమలో ఏదో ఒక టాలెంట్ ఉంది.. దయచేసి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ స్టూడియోల వెంట పడిగాపులు కాస్తుంటారు.
Actress Rohini Sensational Comments: వెండితెరపై ఒక్కసారైనా కనిపించాలని ఎంతోమంది కలలు కంటుంటారు. తమలో ఏదో ఒక టాలెంట్ ఉంది.. దయచేసి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ స్టూడియోల వెంట పడిగాపులు కాస్తుంటారు.
P Krishna
సినీ ఇండస్ట్రీలో ఛాన్స్ అంటే సామాన్యమైన విషయం కాదు. ఎంత టాలెంట్ ఉన్నా.. దానికి తోడు అదృష్టం ఉండాలని అంటారు. వారసత్వంగా ఎంతోమంది నటీనటులు ఎంట్రీ ఇచ్చినప్పటికీ సరైన సక్సెస్ లేకపోవడంతో కనుమరుగయ్యారు. చాలా కాలంగా సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తుంది కాస్టింగ్ కౌచ్. చిత్ర పరిశ్రమలో ఛాన్స్ రావాలంటే కొంతమందికి కమిట్ మెంట్ ఇవ్వాల్సిందే అంటూ ఎంతోమంది నటీమణులు తమ ఆవేదనను మీడియా సాక్షిగా వెలుబుచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి హీరోయిన్ స్థాయిలో ఉన్నవారు ఏదో ఒక సమయంలో కాస్టింగ్ కౌచ్ కి గురైన వారే అంటుంటారు. తాజాగా కాస్టింగ్ కౌచ్ పై జబర్ధస్త్ నటీ, యాంకర్ రోహిణి సంచలన వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే..
ఎంతోమంది కళాకారులు ప్రతిరోజూ వేల సంఖ్యలో స్టూడియోల వెంట కాళ్లు అరిగేలా తిరుగుతుంటారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేమేంటో చూపిస్తామని దర్శకులు, నిర్మాతలను ప్రాదేయపడుతుంటారు. దీన్ని కొంతమంది దళారులు క్యాష్ గా చేసుకుంటారు. మగవారి వద్ద డబ్బులు గుంజడం, అమ్మాయిలను రాత్రికి కమిట్ మెంట్ ఇస్తే ఛాన్స్ ఇస్తామని మభ్యపెడతారు. ఎంతోమంది యువతులు అలాంటి వారి ట్రాప్ లో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల జబర్ధస్త్ కామెడీ షోతో బాగా పాపులర్ అయిన రోహిణి వరుస చిత్రాలతో బిజీ నటిగా మారింది. ఇండస్ట్రీలో కమిట్‌మెంట్ పై జబర్ధస్త్ నటి, యాంకర్ రోహిణి గతంలో చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జబర్ధస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రోహిణి ఓ పక్క టీవీ షోలు మరో పక్క వెబ్ సీరీస్ తో పాటు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. తాజాగా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతూ..‘నాకు ఇండస్ట్రీలో ఛాన్స్ అంత ఈజీగా రాలేదు.. నాకే కాదు ఎవరికి కూడా అంత సులభంగా ఛాన్సులు రావు. అవకాశాల కోసం చాలా మంది దగ్గరకు వెళ్లాను.. నాతో అసభ్యంగా మాట్లాడేవారు. కొంతమంది ఇన్ డైరెక్ట్ గా అడిగితే.. కొంతమంది డైరెక్టుగా కమిట్మెంట్ అడిగేవారు. ఇక్కడ రాణించాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు.. కమిట్మెంట్ కూడా ఇవ్వాలని తెగేసి చెప్పేవారు. వాళ్ల మాటలు విని చాలా బాధపడేదాన్ని. నా తండ్రి లాంటివాడని ఓ మూవీ ఆడిషన్ కి వెళ్లాను. నీకు అవకాశం ఇస్తే నాకేంటీ? అడిగాడు. దానికి నాకు కోపం వచ్చి వచ్చేశాను.. ఆ తర్వాత సినిమాలో నుంచి నన్ను తీసినట్లు తెలిసింది. ఎన్ని కష్టాలు వచ్చినా మనకు టాలెంట్ ఉంటే ఎవరికీ తల వంచాల్సిన అవసరం లేదు.నేను నా టాలెంట్ నమ్మి ముందుకు వెళ్లాను.. ఈ పొజీషన్లో ఉన్నాను. నాకు జీవితంలో పెద్ద పెద్ద గోల్స్ లేవు, నేను ప్రస్తుతం హ్యాపీగానే ఉన్న’ అంటూ మాట్లాడింది. మరి రోహిణి కామెంట్స్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.