iDreamPost
android-app
ios-app

Rashmika Mandanna: రష్మిక మందన్నకి షాక్.. లక్షల్లో మోసం చేసిన మేనేజర్

  • Author Soma Sekhar Published - 04:03 PM, Mon - 19 June 23
  • Author Soma Sekhar Published - 04:03 PM, Mon - 19 June 23
Rashmika Mandanna: రష్మిక మందన్నకి షాక్.. లక్షల్లో మోసం చేసిన మేనేజర్

రష్మిక మందన్న.. ‘ఛలో’ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి, తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుతో పాటుగా స్టార్ హీరోయిన్ రేంజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక బాలీవుడ్ లోనూ సత్తా చాటాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? రష్మిక మేనేజర్ ఆమెను లక్షల్లో మోసం చేశాడట. ఇప్పుడు ఇదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..

సినిమా షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకు భారీ షాక్ తగిలిందట. అది కూడా బయటి వ్యక్తుల వల్ల కాదు.. తన మేనేజర్ ద్వారానే. రష్మిక కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మేనేజర్ గా ఉన్న వ్యక్తి ఆమెను మోసం చేసి లక్షల్లో టోకరా వేశాడట. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 80 లక్షలు ఆమెను మోసం చేశాడని సమాచారం. అయితే ఈ విషయం బయటకి పొక్కితే న్యూసెన్స్ అవుతుందని, ఇదంత ఇష్టం లేక పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదట నేషనల్ క్రష్. అయితే ఇండస్ట్రీలో ఇలాంటి వ్యవహరాలు అస్సలు దాగోవు అన్నసంగతి మనకు తెలిసిందే.  ఈ విషయం తెలిసిన రష్మిక ఫ్యాన్స్ పాపం రష్మిక అంటూ బాధపడుతున్నారు.

ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వెయ్యాలని చూస్తున్న రష్మికకు నిరాశే ఎదురైంది. బాలీవుడ్ లో నటించిన గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాలు ఆశించినంత విజయం సాధించలేకపోయాయి. దాంతో ఈ అమ్మడు ఆశలు అన్ని యానిమల్ సినిమాపైనే ఉన్నాయి. రణ్ బీర్ కపూర్ హీరోగా సన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా అగష్టు 11న విడుదల కానుంది. ఇక మరో పాన్ ఇండియా మూవీ పుష్ప 2 షూటింగ్ జరుపుకుంటోంది. ఈ రెండు సినిమాలపైనే ఈ ముద్దుగుమ్మ ఆశలు పెట్టుకుంది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetMeritkingTimebetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobetjojobet girişbahiscasinoMadridbetMadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetnakitbahiscasibomcasibomjojobetgrandpashabetcasibomgrandpashabet girişbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabet