iDreamPost
android-app
ios-app

సల్మాన్ పెళ్లి చేసుకునే దాకా చెప్పులు వేసుకోను! స్టార్ హీరోయిన్ ప్రతిజ్ఞ.. వీడియో వైరల్

  • Author Soma Sekhar Published - 04:33 PM, Wed - 5 July 23
  • Author Soma Sekhar Published - 04:33 PM, Wed - 5 July 23
సల్మాన్ పెళ్లి చేసుకునే దాకా చెప్పులు వేసుకోను! స్టార్ హీరోయిన్ ప్రతిజ్ఞ.. వీడియో వైరల్

ఇండియాలో మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే? చాలా మంది పేర్లు లిస్ట్ లోకి వస్తాయి. అయితే వారందరిలో ఫస్ట్ వినిపించే పేరు.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పేరు. ఐదు పదుల వయసు దాటినా గానీ.. ఇంకా పెళ్లి చేసుకోలేదు ఈ బాలీవుడ్ కండల వీరుడు. ఎప్పటికప్పుడు హీరోయిన్స్ తో డేటింగ్ వార్తలతో జనాల్లో ఉంటాడు సల్మాన్ భాయ్. తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కాడు సల్మాన్. అయితే ఈ సారి అతడు వార్తల్లో నిలవడానికి కారణం ఓ స్టార్ హీరోయిన్ ప్రతిజ్ఞ చేయడమే. సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకునేదాక నేను చెప్పులు లేకుండా తిరుగుతానని ఆ స్టార్ హీరోయిన్ ప్రతిజ్ఞ చేసింది. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో? ఇప్పుడు తెలుసుకుందాం.

సల్మాన్ ఖాన్.. సినిమా వార్తల కంటే ఎక్కువగా హీరోయిన్లతో ఎఫైర్స్ వార్తలతోనే ఎక్కువగా జనాల్లో నానుతుంటాడు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు బాలీవుడ్ కండల వీరుడు. అసలు విషయం ఏంటంటే? బాలీవుడ్ స్టార్ హీరోయిన్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రాఖీ సావంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ లో ఆసక్తికరంగా మారాయి. ముంబై ఎయిర్ పోర్ట్ లో రాఖీ సావంత్ ను చూసి ఎయిర్ పోర్ట్ సిబ్బంది, ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. దానికి కారణం.. ఆమె షూ వేసుకోకుండా, చేతిలో పట్టుకురావడమే. దాంతో ఈ దృశ్యం చూసిన కొందరు ఆమెను.. మేడం ఇలా చెప్పులు లేకుండా నడుస్తున్నారు ఎందుకు? అని ప్రశ్నించారు. దానికి ఆమె విచిత్రమైన సమాధానం చెప్పింది. ప్రస్తుతం రాఖీ సావంత్ చెప్పిన ఆన్సర్ వైరల్ గా మారింది.

ఇంతకీ రాఖీ సావంత్ చెప్పిన విషయం ఏంటంటే? సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకునే దాక నేను చెప్పులు వేసుకోను. ఇది నా ప్రతిజ్ఞ. ఇక ఈ మాటలు విని అక్కడ ఉన్న వారంతా షాక్ కు గురైయ్యారు. సల్మాన్ భాయ్ త్వరగా పెళ్లి చేసుకోవాలని, పిల్లల్ని కనాలని వారు దేశానికి ఎంతో అవసరం అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇక చెప్పులు లేకుండానే శ్రీలంక నుంచి దుబాయ్ మీదుగా ముంబైకి వచ్చానని తెలిపింది. ఇక ఈ స్టేట్ మెంట్ ను చూసిన నెటిజన్లు.. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపారేస్తున్నారు. మరి రాఖీ సావంత్ చేసిన ప్రతిజ్ఞపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet