iDreamPost

ఉజ్జయిని మహకాళేశ్వర్ భస్మ హారతిలో హీరోయిన్స్.. అత్యంత సాదా సీదాగా!

ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని ఇటీవల సినీ, రాజకీయ, క్రీడా సెలబ్రిటీలు తరచుగా సందర్శిస్తున్నారు. గోవింద, హేమామాలిని, మనోజ్ బాజ్‌పేయి, రవీనా టాండన్, పరిణీతి చోప్రా వంటి నటులతో పాటు క్రికెటర్స్ సందర్శించారు.

ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని ఇటీవల సినీ, రాజకీయ, క్రీడా సెలబ్రిటీలు తరచుగా సందర్శిస్తున్నారు. గోవింద, హేమామాలిని, మనోజ్ బాజ్‌పేయి, రవీనా టాండన్, పరిణీతి చోప్రా వంటి నటులతో పాటు క్రికెటర్స్ సందర్శించారు.

ఉజ్జయిని మహకాళేశ్వర్ భస్మ హారతిలో హీరోయిన్స్.. అత్యంత సాదా సీదాగా!

దేశంలో ఉన్న పేరు గాంచిన ఆలయాల్లో ఒకటి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ దేవాలయం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. ఇక్కడ నిత్యం పూజలు అందుకుంటున్నాడు మహా కాళేశ్వరుడు. ఇటీవల కాలంలో సాధారణ భక్తులతో పాటు సినీ సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నేతలు, క్రీడాకారులు కూడా ఈ దేవాలయాన్ని తరచుగా సందర్శించడంతో మరింత ఫేమస్ అయ్యింది ఈ గుడి. ఇక గుడిలో ప్రత్యేకత ఏంటంటే.. ఉదయం 4 గంటల నుండి ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. తెల్లవారు జామున మహాకాళేశ్వర స్వామి వారికి భస్మ హారతిని ఇస్తారు. ఈ పూజ రెండు గంటల పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఇద్దరు ముద్దుగుమ్మలు.

టాలీవుడ్ అండ్ బాలీవుడ్ ముద్దుగుమ్మలు రాఖీ ఖన్నా, వాణి కపూర్ ఇద్దరు ఉజ్జయినీ మహా కాళేశ్వర్ దేవాలయాన్ని మంగళవారం సందర్శించారు. తెల్లవారు జామున ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉజ్జయినిలో భస్మ హారతి పూర్తయిన తర్వాత.. గర్భగుడిలోకి వెళ్లి దేవుడి ఆశీర్వాదం తీసుకున్నారు. సాధారణ భక్తులుగా మారిపోయారు. ఇద్దరు చీరలు కట్టి.. సామాన్యుల మధ్యలో కూర్చుని భక్తి పారవశ్యంలో మునిగి తేలిపోయారు. ఇక వాణీకపూర్, రాఖి ఖన్నా ఎప్పటి నుండో ఫ్రెండ్స్ అన్న సంగతి విదితమే. వాణీ.. తమిళ్ డబ్బింగ్ మూవీ ఆహా కళ్యాణంతో తెలుగు వారికి సుపరిచితం. ఇందులో మన నాచురల్ స్టార్ నాని హీరో. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తోంది. ఇకపోతే రాశి ఖన్నా.. ఇటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలతో బిజీగా మారిపోయింది.

రుద్ర, ఫర్జీ వంటి వెబ్ సిరీస్‌లతో బాలీవుడ్ బాట పట్టిన రాఖీ ఖన్నా.. యోధతో మరో సక్సెస్ అందుకుంది. ఈ ఏడాది తమిళంలో ఆరణ్మణి 4 (తెలుగులో బాక్) చిత్రంతో అలరించింది ఈ బ్యూటీ. మరో మిల్కీ బ్యూటీ తమన్నాతో ఓ స్పెషల్ పాటకు చిందులేసింది. థాంక్యూ తర్వాత తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఈ సోయగం.. ప్రస్తుతం నాలుగు చిత్రాలను లైన్లో పెట్టింది. ఇందులో రెండు హిందీ చిత్రాలు కాగా, ఒకటి తెలుగు, ఒక తమిళ సినిమాలున్నాయి. ద సబర్మతి రిపోర్ట్, టీఎంఈ, తమిళంలో మేథావితో పాటు తెలుగులో తెలుసు కదా అనే చిత్రం చేస్తుంది. ఇందులో సిద్దు జొన్నల గడ్డ హీరో. ఈ మూవీతో నీరజ కోన డైరెక్టర్ గా మారబోతుంది.కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఇందులో మరో హీరోయిన్. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఇటీవల కాలంలో ఈ గుడిని..  విరాట్ కోహ్లీ దంపతులతో పాటు సినీ,  రాజకీయ ప్రముఖులు సందర్శించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి