iDreamPost
android-app
ios-app

ఆ రీజన్స్ వల్లే ముద్దు సీన్స్ లో నటించట్లేదు! వైరలవుతున్న ప్రియమణి కామెంట్స్..

  • Author Soma Sekhar Published - 06:02 PM, Sat - 1 July 23
  • Author Soma Sekhar Published - 06:02 PM, Sat - 1 July 23
ఆ రీజన్స్ వల్లే ముద్దు సీన్స్ లో నటించట్లేదు! వైరలవుతున్న ప్రియమణి కామెంట్స్..

ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు కెరీర్ టైమ్ తక్కువ. దాంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా కొందరు హీరోయిన్స్.. అందాల ఆరబోతకు వెనకాడరు. ఇక మరికొంత మంది హీరోయిన్స్ అయితే ఎక్స్ పోజింగ్ అంటేనే ఆమడదూరానికి పోతారు. ఇక కొంత మంది సీన్ డిమాండ్ మేరకు బోల్డ్ అండ్ హాట్ సీన్స్ లో నటించడానికి ఏ మాత్రం వెనకాడరు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రియమణి తాను ముద్దు సీన్లలో ఎందుకు నటించట్లేదో కారణాలు చెప్పుకొచ్చింది. ఇటీవలే నాగచైతన్య నటించిన కస్టడీ సినిమాలో నటించిన ప్రియమణి.. మూవీలో నటనకు గాను ప్రశంసలు అందుకుంది.

ప్రియమణి.. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ గా సుదీర్ఘ కాలం తన కెరీర్ ను కొనసాగించింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే బుల్లితెర షోలల్లో జడ్జిగా మెరుస్తూ.. బిజీగా ఉంది. ఇక ఇటీవలే కస్టడీ సినిమాతో ప్రశంసలు అందుకుంది ప్రియమణి. కాగా.. మరికొన్ని రోజుల్లో ప్రియమణి నటించిన బాలీవుడ్ మూవీ జవాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడారు ప్రియమణి. తాను పెళ్లి తర్వాత ఎందుకు ముద్దు సీన్లలో నటించట్లేదో? చెప్పుకొచ్చారు.

మూవీలో నాది ఒక క్యారెక్టర్ మాత్రమే అని, ముద్దు సీన్లలో నటిస్తే.. నేను వ్యక్తిగతంగా ఇబ్బందులు పడతానని తెలిపారు. ఇక అలాంటి సన్నివేశాల్లో నటిస్తే.. నా భర్తకు నేను సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. 2017లో నా పెళ్లి జరిగిందని అప్పటి నుంచి అలాంటి సీన్లకు దూరంగా ఉంటూ వచ్చానని ప్రియమణి తెలిపింది. అదీకాక నేను నటించిన సినిమాలను నా కుటుంబ సభ్యులు, నా భర్త తరపు కుటుంబ సభ్యులు చూస్తారు.. అలాంటప్పుడు, ఇలాంటి సీన్లు చూస్తే వారు ఇబ్బంది పడతారు. అందుకే అలాంటి ఇంటిమేట్ సీన్లలో నటించడానికి ఒప్పుకోవడం లేదని ప్రియమణి అన్నారు.

ఇక అలాంటి సీన్లలో నటించి ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదని ఆమె చెప్పుకొచ్చారు. కొన్ని విషయాల్లో నేను ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రియమణి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రియమణి తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మిమ్మల్ని చూసి ఇతర హీరోయిన్లు నేర్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişMadridbetMariobetmeritbetcasibom girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetcasibom girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş