iDreamPost
android-app
ios-app

Pragya Jaiswal : బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన.. ప్రగ్య జైస్వాల్

  • Published Jun 13, 2024 | 11:05 AM Updated Updated Jun 13, 2024 | 11:05 AM

కొంతమంది నటి నటులకు ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి చాలానే సమయం పడుతుంది. సరైన ఆఫర్లు లేక కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా కూడా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రగ్య జైస్వాల్ పరిస్థితి కూడా ఇదే.

కొంతమంది నటి నటులకు ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి చాలానే సమయం పడుతుంది. సరైన ఆఫర్లు లేక కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా కూడా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రగ్య జైస్వాల్ పరిస్థితి కూడా ఇదే.

  • Published Jun 13, 2024 | 11:05 AMUpdated Jun 13, 2024 | 11:05 AM
Pragya Jaiswal : బాలీవుడ్  స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన.. ప్రగ్య జైస్వాల్

ప్రగ్య జైస్వాల్ వెండి తెరమీద కనిపించి.. దాదాపు రెండేళ్లు దాటిపోయింది. అఖండ సినిమాలో బాలకృష్ణ సినిమాతో పెద్ద హిట్ ను అందుకుంది. ఈ అమ్మడు. ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించినా కానీ అంతగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. కొంతమంది నటి నటులకు ప్రత్యేకమైన గుర్తింపు రాడానికి చాలానే సమయం పడుతుంది. సరైన ఆఫర్లు లేక కొన్నాళ్ల పాటు.. సినిమాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రగ్య జైస్వాల్ పరిస్థితి కూడా ఇదే. సరైన ఆఫర్లు లేక రెండేళ్ల పాటు.. సినిమాలకు దూరమైన ఈ అమ్మడికి ఇప్పుడు ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కింది. మరి ఇంతకీ ఈ సినిమా ఏంటో ఆ స్టార్ హీరో ఎవరో చూసేద్దాం.

ప్రగ్య జైస్వాల్ కొన్నాళ్లుగా మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలోనే.. అక్షయ్ కుమార్ తో రొ*మాన్స్ చేయబోతుందట ఈ అమ్మడు . ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న సినిమా ఖేల్ ఖేల్ మే . ఇది ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ డ్రామా. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కు జోడిగా మొత్తం ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ప్రగ్యతో పాటు.. తాప్సీ, వాణిక‌పూర్‌ కూడా ఈ సినిమాలో నటించనున్నారు. ఇక ఈ సినిమాలో ప్రగ్య నటిస్తున్న విషయం తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాను ఆగష్టు 15 న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది .. రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Pragya jaiswal

అయితే ప్రగ్య జైస్వాల్ రెండేళ్ల తర్వాత వెండి తెరపైన కనిపిస్తుంది అనుకుంటే.. బాలీవుడ్ లో అయితే ఏకంగా పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తుంది ఈ అమ్మడు. 2014 లో హిందీలో వ టిటూ ఎమ్‌బీఏ అనే సినిమాను చేసింది ఈ అమ్మడు. ఈ సినిమా అంతా కూడా లవ్ స్టోరీ బ్యాక్డ్రాప్ తోనే కొనసాగుతుంది. కానీ ఆ సమయంలో ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీనితో బాలీవుడ్ లో ప్రగ్యకు అంతగా అవకాశాలు రాలేదు. ఇక ఇప్పుడైనా ప్రగ్యకు మంచి ఆఫర్లు వస్తాయేమో వేచి చూడాలి. అక్షయ్ మూవీతో అయినా ఈ అమ్మడి గ్రాఫ్ పెరిగితే.. మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఈ సినిమా ప్రగ్య కెరీర్ పై ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో చూడాలి.  మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/