iDreamPost
android-app
ios-app

రెండో పెళ్లి వార్తలపై స్పందించిన ప్రగతి..

  • Published Oct 30, 2023 | 3:58 PM Updated Updated Oct 30, 2023 | 3:58 PM

తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు వార్తలు రాశాయని అన్నారు. ఆ వార్తలు చూసినపుడు తనకు చాలా బాధ వేసిందని చెప్పారు.

తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు వార్తలు రాశాయని అన్నారు. ఆ వార్తలు చూసినపుడు తనకు చాలా బాధ వేసిందని చెప్పారు.

  • Published Oct 30, 2023 | 3:58 PMUpdated Oct 30, 2023 | 3:58 PM
రెండో పెళ్లి వార్తలపై స్పందించిన ప్రగతి..

ప్రముఖ నటి ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఆమె ఓ ప్రముఖ నిర్మాతను పెళ్లి చేసుకోబోతోందంటూ కొన్ని న్యూస్‌ సైట్లలో వార్తలు కూడా వచ్చాయి. అయితే, ప్రగతి రెండో పెళ్లి వార్తల్లో నిజం లేదని తేలింది. ఆ వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని వెల్లడైంది. ఇక, రెండో పెళ్లి వార్తలపై నటి ప్రగతి తాజాగా స్పందించారు. పెళ్లి వార్తలు రాసిన వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా, ఆయన మీడియాతో మాట్లాడుతూ..

తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు వార్తలు రాశాయని అన్నారు. ఆ వార్తలు చూసినపుడు తనకు చాలా బాధ వేసిందని చెప్పారు. ఆధారాలు లేకుండా వార్తలు రాయటం బాధ్యతా రాహిత్యం అంటూ మండిపడ్డారు. నటుల మీద ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయవచ్చని అనుకోవటం తప్పన్నారు. ‘ మీకేం హక్కు ఉందని మరొకరి వ్యక్తిగత జీవితంపై ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వార్తల్ని ఆమె ఖండించారు.

ఇకపై అలాంటి వార్తలు వచ్చినపుడు చెక్‌ చేసుకుని, నిజా నిజాలు తెలుసుకుని రాయాలన్నారు. ఒకరి గురించి రాసేప్పుడు హద్దులు మీరకూడదన్నారు. పెళ్లి సంగతి ఏదైనా ఉంటే తానే స్వయంగా చెబుతానన్నారు. ఆధారాలు లేకుండా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయటం పద్దతి కాదని హెచ్చరించారు. కాగా, నటి ప్రగతి సోషల్‌ మీడియా చాలా యాక్టీవ్‌గా ఉంటారు. సోషల్‌ మీడియా వేదికగా తనకు సంబంధించిన విషయాలపై స్పందిస్తూ ఉంటారు. మరి, రెండో పెళ్లిపై ప్రగతి ఇచ్చిన క్లారిటీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio