iDreamPost
android-app
ios-app

సిల్వ‌ర్ స్క్రీన్‌పై అందం,అభిన‌యంతో ఆకట్టుకుంటున్న నటి పోతన హేమ

  • Published Dec 06, 2025 | 2:15 PM Updated Updated Dec 06, 2025 | 2:15 PM

రంగుల ప్ర‌పంచంలోకి దూసుకొచ్చింది ఓ తార‌.. ఆటంకాలు, అడ్డంకులు దాటుకుని ఆత్మ‌విశ్వాసంతో సినీ ప్ర‌యాణం చేస్తోంది యువన‌టి హేమ పోత‌న. అందం-అభినయంతో సినీ రంగంలో బంగారు భవిష్య‌త్‌ను నిర్మించుకుంటోంది. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయినా, దుఃఖాన్ని బలంగా మార్చుకుని జీవితాన్ని స్వయంగా తీర్చిదిద్దుకుంటోంది.

  • Published Dec 06, 2025 | 2:15 PMUpdated Dec 06, 2025 | 2:15 PM
సిల్వ‌ర్ స్క్రీన్‌పై అందం,అభిన‌యంతో ఆకట్టుకుంటున్న నటి పోతన హేమ

రంగుల ప్ర‌పంచంలోకి దూసుకొచ్చింది ఓ తార‌.. ఆటంకాలు, అడ్డంకులు దాటుకుని ఆత్మ‌విశ్వాసంతో సినీ ప్ర‌యాణం చేస్తోంది యువన‌టి హేమ పోత‌న. అందం-అభినయంతో సినీ రంగంలో బంగారు భవిష్య‌త్‌ను నిర్మించుకుంటోంది. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయినా, దుఃఖాన్ని బలంగా మార్చుకుని జీవితాన్ని స్వయంగా తీర్చిదిద్దుకుంటోంది.

విజయవాడ‌కు చెందిన హేమ చిన్నప్పటి నుంచే జిజ్ఞాస, ధైర్యం అనే రెండు విలువలను ఒడిసిపట్టుకుని పెరిగింది. తల్లిదండ్రులు లేని లోటు ఉన్నప్పటికీ, బాధకు లోనవకుండా, “నా జీవితాన్ని నేను నిర్మించుకుంటాను” అనే స్పష్టమైన సంకల్పంతో హైదరాబాదులో అడుగుపెట్టింది. ఆ ధైర్యమే 2013లో ఆమెను మిస్ హైద‌రాబాద్ కిరీటం ద‌క్కేలా చేసింది. అక్కడి నుంచి ఆమె ప్రయాణం కొత్త మలుపు తీసుకుంది.

సినిమాలపై మక్కువతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన హేమ, 100% లవ్, చ‌లాకీ, కాఫీబార్, రాజ్.. తదితర సినిమాల్లో నటించి తన నటన ప్రతిభను చూపించింది. ఒక రోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆమె జీవితాన్ని పూర్తిగా కుదిపేసింది. డాక్టర్లు కూడా చేతులెత్తేసేంత‌ తీవ్ర పరిస్థితి. కానీ ఆమె మాత్రం ఓడిపోలేదు. మళ్లీ నిలబడింది. ఆ ప్రమాదం ఆమెను ఆపలేదు – మరింత శక్తివంతురాలిని చేసింది.

తాజాగా హేమ ‘మదం’ అనే గ్రామీణ నేపథ్య చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. కథలో భావోద్వేగం, నటనకు విపరీతమైన స్కోప్ ఉన్న ఈ సినిమాతో తన ప్రతిభను మరొక మెట్టుకు తీసుకెళ్లాలని ఆమె లక్ష్యం. సినీ ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ లేకపోయినా, తన ఆత్మవిశ్వాసం, పట్టుదల, కష్టపడే స్వభావం ఆమెను ఇండ‌స్ట్రీలో వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకునేలా చేశాయి. ప్రేక్ష‌కుల అభిమానం పెరుగుతోంది. హేమ పోత‌న ప్రయాణం.. సినిమాను మించిన క‌థ‌, పట్టుదలతో కొన‌సాగుతోన్న విజయం. సినీ రంగంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుని ముందుకు సాగుతోంది ఈ వ‌ర్ధ‌మాన న‌టి.