iDreamPost
android-app
ios-app

పూజా హెగ్డే పెళ్ళికి రెడీ! భర్త కాబోయే లక్కీ పర్సన్ ఎవరంటే?

  • Published Apr 19, 2024 | 4:11 PM Updated Updated Apr 19, 2024 | 4:11 PM

Pooja Hedge Marriage News: తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు.. తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

Pooja Hedge Marriage News: తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు.. తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

  • Published Apr 19, 2024 | 4:11 PMUpdated Apr 19, 2024 | 4:11 PM
పూజా హెగ్డే పెళ్ళికి రెడీ! భర్త కాబోయే లక్కీ పర్సన్ ఎవరంటే?

సినీ ఇండస్ట్రీలో మోడల్ గా కెరీర్ ప్రారంభించి తర్వాత హీరోయిన్లుగా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో పూజా హెగ్డే ఒకరు. ఈ అమ్మడు 2010లో భారత్ నుంచి విశ్వసుందరి పోటీల కోసం ఎంపికైన వారిలో రెండో స్థానంలో నిలిచింది.2012 లో ‘ముగమూడి’ అనే తమిళ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. 2014లో వరుణ్ తేజ్ నటించిన ‘ముకుంద’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్య నటించిన ‘ఒక లైలా కోసం’ మూవీలో నటించింది. అలా వరుసగా స్టార్ హీరోలతో నటించిన పూజా హెగ్డే కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

సినీ ఇండస్ట్రీలో తన క్యూట్ లుక్స్ తో కుర్రాళ్లను కట్టిపడేసిన అందాల భామ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు ఒక్కఊపు ఊపేసింది. కానీ ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పటికప్పుడు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విశేషాలను పంచుకుంటుంది. వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షర్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. పూజా హెగ్డేకి సినిమాలు లేకపోవడంతో బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యనే తన ప్రియుడితో దొరికిపోయింది.. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఈ అమ్మడి గురించి మరో వార్త సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.

Pooja marriage

ఇప్పటి వరకు చాలా సైలెంట్ గా ఉన్న పూజా హెగ్డే తన ప్రియుడితో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మొన్నటి వరకు పూజా హెగ్డే బాయ్ ఫ్రెండ్ అనేది ఎవరికీ పెద్దగా తెలియదు. హిందీ బిగ్ బాస్ 10 ఫేమ్, సీరియల్ యాక్టర్ రోహన్ మెహ్రాతో పూజా హెగ్డే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందట. ఇటీవల వీరిద్దరికి సంబంధించిన ఫోటో బయటకు రావడంతో మీడియాలో వస్తున్న వార్తలకు మరింత ఊతం ఇచ్చినట్లుందని అంటున్నారు. అంతే కాదు ఈ మధ్య పూజా హెగ్డే తన ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్ కి వెళ్లింది. ఆ ఫ్యామిలీ మెంబర్స్ లో రోహన్ కూడా కనిపించాడు..పూజాతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. త్వరలో ఈ క్యూట్ లవర్స్ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియదు.. అఫిషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ కూడా రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరి ఫోటోలు, వార్తలు ట్రెండ్ అవుతున్నాయి.

 

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş