iDreamPost

నటి పవిత్ర గౌడ‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అందుకేనా?

  • Published Jun 11, 2024 | 12:17 PMUpdated Jun 11, 2024 | 12:17 PM

Actress Pavitra Gowda: సినీ ఇండస్ట్రీలో గత నెల నుంచి వరుసగా సెలబ్రెటీల అరెస్టుల పర్వం కొనసాగుతుంది. వివిధ నేరాలపై సినీ తారలు అరెస్ట్ కావడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

Actress Pavitra Gowda: సినీ ఇండస్ట్రీలో గత నెల నుంచి వరుసగా సెలబ్రెటీల అరెస్టుల పర్వం కొనసాగుతుంది. వివిధ నేరాలపై సినీ తారలు అరెస్ట్ కావడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

  • Published Jun 11, 2024 | 12:17 PMUpdated Jun 11, 2024 | 12:17 PM
నటి పవిత్ర గౌడ‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అందుకేనా?

ఇటీవల పలు కేసుల్లో సినీ తారలు అరెస్ట్ కావడం తీవ్ర కలకలం రేపుతుంది. గతంలో పలువురు సినీ నటీనటులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే బెంగుళూరు శివారులో జరిగిన రేవ్ పార్టీలో ప్రముఖ నటి హేమ,ఆషి రాయ్ పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు వీరి రక్త నమూనాలో డ్రగ్స్ షాంపిల్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఈ క్రమంలోనే హేమను బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక మాలీవుడ్ నటుడు కులికల్ జయచంద్రన్ నాలుగేళ్ల పాపపై అత్యాచారం చేసిన ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు.. తాజాగా కన్నడ స్టార్ హీరో దర్శన్ హత్య నేరంపై అరెస్ట్ అయ్యారు. ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ ని సైతం పోలీసులు అరెస్ట్ చేసినట్లే వార్తలు గుప్పుమంటున్నాయి. వివరాల్లోకి వెళితే..

సినీ ఇండస్ట్రీలో వరుసగా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. హేమ, ఆషి రాయ్, కులికల్ జయచంద్రన్ తాజాగా కన్నడ ఛాలెంజింగ్ హీరో దర్శన్ అరెస్టు అయ్యారు. మంగళవారం ఉదయం ఓ హత్య కేసులో మైసూర్ కామాక్షి పాళ్య పోలీసులు హీరో దర్శన్ ని అరెస్ట్ చేసిన విషయం సోషల్ మీడియాలో సంచలనం రేపింది. గత పదేళ్లుగా దర్శన్ ప్రముఖ నటి పవిత్ర గౌడ తో సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల పవిత్ర గౌడ కు రేణుక స్వామి అనే వ్యక్తి అశ్లీల వీడియోలు, అసభ్య మెజేజ్ లు పెడుతున్నట్లు ఆరోపణలు వినిపించాయి. ఈ విషయం పవిత్ర.. దర్శన్ కి చెప్పడంతో ఆయన సీరియస్ గా తీసుకొని రేణుక స్వామిని హత్య చేయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. హత్య కేసులో హీరో దర్శన్‌ను పోలీసులు అరెస్టు చేసిన ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్శన్ తో పాటు ఆయన ప్రియురాలు పవిత్ర గౌడను కూడా బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవిత్ర గౌడను ఆర్ఆర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దర్శన్- పవిత్ర గౌడ కొంత కాలంగా రిలేషన్ షిప్ లో ఉంటున్నట్లు కన్నడ ఇండస్ట్రీలో టాక్. ఇటీవల వీరిద్దరు కలిసి ఎంజాయ్ చేస్తున్నఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన ప్రియురాలిని రేణుక‌స్వామి అనే వ్యక్తి అసభ్య మెసేజ్ లతో ఇబ్బంది పెడుతున్నాడన్న కోపంతో పక్కా ప్లాన్ తో అతన్ని మర్డర్ చేయించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో దర్శన్ తో పాటు మరో పదిమందిని అరెస్ట్ చేసినట్లు కామాక్షి పాళ్య పోలీసులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి